
TCS News: దేశంలోని అతిపెద్ద ఐటీ సేవల సంస్థ టీసీఎస్ ఇటీవల తన లేఆఫ్స్ ప్లాన్ గురించి ప్రకటించిన సంగతి తెలిసిందే. దీంతో 12వేల మందిని తగ్గించాలని ప్లాన్ చేసింది టీసీఎస్. అయితే ఇందులో భాగంగా కొత్తగా కంపెనీలో చేరిన ఫ్రెషర్స్ జాబ్స్ కూడా ప్రమాదంలో ఉన్నట్లు వెల్లడైంది. దీనికి సంబంధించిన ఒక షాకింగ్ విషయాన్ని రెడిట్ పోస్టులో తనకు జరిగిన అనుభవాన్ని పంచుకోవటం పెద్ద సంచలనంగా మారింది.
టీసీఎస్ ఫ్రెషర్ ఉద్యోగులను ఫైర్ చేస్తోందా అంటూ సదరు టెక్కీ ఆరోపించాడు. సదరు ఫ్రెషర్ కంపెనీ తనను ఇంటికి పంపించిన ప్రక్రియ గురించి చెప్పటంతో అందరూ షాక్ అవుతున్నారు. ముందుగా తనను హెచ్ఆర్ తన క్యాబిన్ కి రమ్మని పిరిచారని.. రాగానే వెంటనే ఫోన్ స్విచ్ ఆఫ్ చేయమని చెప్పారని అతడు వెల్లడించాడు. వెంటనే తనను రాజీనామా చేస్తావా లేక తొలగించమంటావా అని రెండు ఆప్షన్స్ ఇచ్చి వెంటనే తేల్చుకోమని చెప్పినట్లు పోస్టులో వెల్లడించాడు. తాము తొలగిస్తే నెటగివ్ రిలీవ్ లెటర్ ఇస్తామని హెచ్చరించినట్లు చెప్పాడు. పైగా ఎలాంటి కంపెన్సేష్ కూడా రాదని హెచ్చరించినట్లు చెప్పాడు.
వ్యక్తిగత కారణాలతో కంపెనీని విడిచి వెళ్లిపోతున్నట్లు పేర్కొంటూ రాజీనామా చేస్తే మూడు నెలల జీతం ఇస్తామని హెచ్ఆర్ బెదిరించిన విషయాన్ని రెడిట్ యూజర్ చెప్పాడు. తాను ఒక యాక్టివ్ ప్రాజెక్టులో పనిచేస్తున్నప్పటికీ హఠాత్తుగా ఉద్యోగం కోల్పోవాల్సి వచ్చిందని బాధపడ్డాడు. అలాగే హెచ్ఆర్ తో మాట్లాడుతున్నప్పడు అయోమయంలో ఉన్నానని, బాధ కలిగిందని చెప్పిన టెక్కీ.. క్యాబిన్ నుంచి బయటకు వెళ్లేటప్పుడు కనీసం కళ్లలో నీళ్లు కూడా కనిపించకుండా చేశారన్నారు. నిర్ణయం తీసుకోవటానికి ముందు తండ్రికి కాల్ చేస్తానంటే హెట్ఆర్ అందుకు అంగీకరించలేదని కేవలం 15 నిమిషాల్లో తనతో రాజీనామా చేయించారని వెల్లడించాడు.
ALSO READ : కొత్త ఐటీ బిల్లుపై వెనక్కి తగ్గిన కేంద్రం.. సడన్గా ఈ యూటర్న్ ఎందుకంటే..
హెచ్ఆర్ తనపై రాజీనామాకు తీవ్రంగా ఒత్తిడి చేయటంతో చేసేదేమీ లేక సేఫ్ ఆప్షన్ అయిన రాజీనామాను ఎంచుకోవాల్సి వచ్చిందని టెక్కీ చెప్పటంతో టీసీఎస్ అనైతిక విధానాలను ఫాలో అవుతోందని చాలా మంది సోషల్ మీడియాలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికారికంగా తొలగింపుల సంఖ్యలను తక్కువగా చూపించేందుకే కంపెనీ ఇలాంటి విధానాలను ఎంచుకుంటోందని మరికొందరు అంటుండగా.. రతన్ టాటా మరణం తర్వాత టాటా యాజమాన్య వైఖరిలో అనేక మార్పులు కనిపిస్తున్నాయనే కామెంట్స్ కూడా చాలా మంది నుంచి వినిపిస్తున్నాయి. మెుత్తానికి రెడిట్ యూజర్ తన అనుభవాన్ని పంచుకోవటంతో చాలా మంది డైలమాలో ఉన్నారు. తమను ఎప్పుడు హెచ్ఆర్ క్యాబిన్ కి పిలుస్తుందో అనే భయాలతో ఇప్పటికే చాలా మంది ఇతర కంపెనీల్లో ఆఫర్ల కోసం సెర్చ్ చేసుకోవటం స్టార్ట్ చేసేశారు.