సైనా నెహ్వాల్ విడాకులకి కొద్దిసేపటి ముందు, కశ్యప్ ఇన్‌స్టాగ్రామ్ స్టోరీ వైరల్.. మ్యాటరేంటంటే ?

సైనా నెహ్వాల్ విడాకులకి కొద్దిసేపటి ముందు, కశ్యప్ ఇన్‌స్టాగ్రామ్ స్టోరీ వైరల్.. మ్యాటరేంటంటే ?

భారత టెన్నిస్ స్టార్ సైనా నెహ్వాల్, భర్త పారుపల్లి కశ్యప్ విడిపోవాలని నిర్ణయించుకున్నట్లు ప్రకటించడం దేశం మొత్తాన్ని ఆశ్చర్యానికి గురిచేసింది. అయితే ఈ విషయంపై కశ్యప్ ఇంకా ఎలాంటి విషయాన్ని చెప్పకపోగా, సైనా ప్రకటనకు దాదాపు 6 గంటల ముందు ఆయన ఇన్‌స్టాగ్రామ్లో ఓ స్టోరీ పోస్ట్ చేశారు. ఇన్‌స్టా స్టోర్టీలో విడాకుల విషయంపై అతని అభిప్రాయాన్ని చెప్పకపోయిన, తాను బాగానే ఉన్నానని చెప్పకుండానే చెప్పారు. 

జూలై 11  నుండి 13 వరకు నెదర్లాండ్స్‌లోని హిల్వారెన్‌బీక్‌లో జరిగిన అవేకెనింగ్స్ ఫెస్టివల్‌ను కశ్యప్ ఆస్వాదిస్తున్నట్లు ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో ఉంది. ఈ స్టోరీలో కశ్యప్ చుట్టూ కొంతమంది ఫ్రెండ్స్ ఉన్నట్లు చూడవచ్చు.

కశ్యప్ భారతదేశం తరపున బ్యాడ్మింటన్ ప్లేయర్ కూడా. అతను 2014 కామన్వెల్త్ గేమ్స్ గోల్డ్ మెడల్ విజేత. 11 సంవత్సరాల క్రితం అతను ఈ మెడల్ సాధించినప్పుడు, 32 సంవత్సరాలలో ఒక భారతీయ బ్యాడ్మింటన్ ప్లేయర్ కామన్వెల్త్ గేమ్స్ లో బంగారు పతకం గెలవడం ఇదే మొదటిసారి. భారత బ్యాడ్మింటన్  కోచ్‌లు మాజీ ఆల్-ఇంగ్లాండ్ ఛాంపియన్లు ప్రకాష్ ఇంకా పుల్లెల గోపీచంద్ దగ్గర కశ్యప్  శిక్షణ పొందాడు.

►ALSO READ | IND vs ENG 2025: జడేజా పైనే భారం.. లార్డ్స్ టెస్టులో ఓటమి దిశగా టీమిండియా

ఒలింపిక్స్‌లో క్వార్టర్ ఫైనల్స్‌కు చేరుకున్న తొలి భారతీయ పురుష బ్యాడ్మింటన్ ప్లేయర్ కూడా అతనే. అతను 2012లో సమ్మర్ గేమ్స్‌లో ఈ ఘనత సాధించాడు. 2013లో తన కెరీర్‌లో అత్యుత్తమ ప్రపంచ ర్యాంకింగ్ ఆరవ స్థానానికి చేరుకున్నాడు, కానీ గాయాలు అతన్ని అదే స్థాయి ప్రదర్శనను కొనసాగించలేకపోయాయి.

 కశ్యప్‌తో  విడిపోవడం గురించి సైనా నెహ్వాల్ ఏమన్నారంటే : జీవితం కొన్నిసార్లు మనల్ని వేర్వేరు దారుల్లోకి తీసుకెళ్తుంది. చాలా ఆలోచించిన తర్వాత కశ్యప్ నేను విడిపోవాలని నిర్ణయించుకున్నాం. మా ఇద్దరి కోసం ఒకరికొకరు ఎదుగుదల కోరుకున్నాం. ఈ జ్ఞాపకాలకు నేను కృతజ్ఞురాలిని, జీవితంలో ముందుకు సాగలనికి కోరుకుంటున్నాను. ఇలాంటి సమయంలో మా వ్యక్తిగత విషయాలను  అర్థం చేసుకుని గౌరవించినందుకు ధన్యవాదాలు అని సైనా తెలిపారు. సైనా నెహ్వాల్ రెండుసార్లు కామన్వెల్త్ గేమ్స్ ఛాంపియన్ కూడా.  

సైనా, కశ్యప్ 2018 డిసెంబర్‌లో పెళ్లి చేసుకున్నారు. వీరిద్దరూ కూడా చిన్నప్పటి నుంచి హైదరాబాద్‌లోని పుల్లెల గోపీచంద్ అకాడమీలో  శిక్షణ పొందారు. సైనా నెహ్వాల్ ఒలింపిక్ కాంస్య పతకం విజేత, ప్రపంచ నంబర్ 1 ర్యాంకింగ్‌తో వరల్డ్ ఐకాన్‌గా మారగా, కశ్యప్ ప్రపంచ టాప్ 10లోకి ప్రవేశించి 2014 కామన్వెల్త్ క్రీడల్లో గోల్డ్ మెడల్ విన్నర్.