షిప్​లో మంటలు..3,000 కార్లు బుగ్గి

షిప్​లో మంటలు..3,000 కార్లు బుగ్గి

సుమారు 3 వేల కార్లతో అట్లాంటిక్ మహాసముద్రంలో ప్రయాణిస్తున్న కార్గో షిప్​లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. జర్మనీ నుంచి ఈజిప్ట్ కు వెళ్తుండగా.. నెదర్లాండ్స్ లోని అమెలాండ్ ఐలాండ్ కు 27 కి.మీ. దూరంలో షిప్​లో మంటలు చెలరేగాయి. మంటలు వ్యాపించడంతో సిబ్బంది సముద్రంలో దూకారు. కొంతమందికి తీవ్ర గాయాలయ్యాయి. ఒకరు చనిపోగా, మిగిలిన 23 మందిని బోట్లు, హెలికాప్టర్ల సాయంతో రక్షించారు. 

షిప్ లో మంటలను ఆర్పేందుకు ఫైర్ సిబ్బంది ప్రయత్నిస్తున్నారు. కానీ పెద్ద ఎత్తున మంటలు చెలరేగడంతో వాటిని అదుపులోకి తీసుకురావడం ఇబ్బందికరంగా మారింది. షిప్ మునిగిపోయే పరిస్థితి తలెత్తిందని, అది మునిగిపోకుండా ప్రయత్నాలు చేస్తున్నామని అధికారులు పేర్కొన్నారు. అగ్నిప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియలేదన్నారు.  - ది హేగ్ (నెదర్లాండ్స్)