- ఆందోళనకు గురైన రోగులు
నిర్మల్, వెలుగు: నిర్మల్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రిలో షార్ట్‌సర్క్యూట్ కారణంగా ఆదివారం ఉదయం మంటలు చెలరేగాయి. ఆస్పత్రి పైఅంతస్తులో ఉన్న స్టోర్ రూమ్ నుంచి దట్టమైన పొగలు రావడంతో రోగులు, డాక్టర్లు, వైద్య సిబ్బంది తీవ్ర ఆందోళనకు గురయ్యారు. కొందరు బయటకు పరుగులు తీశారు. ఫైర్ డిపార్ట్మెంట్కు సమాచారం అందించగా వెంటనే అక్కడికి చేరుకున్న సిబ్బంది మంటలను ఆర్పివేశారు.
భారీ ప్రమాదం తప్పడంతో రోగులు, డాక్టర్లు, సిబ్బంది ఊపిరి పీల్చుకున్నారు. ప్రమాదం కారణంగా స్టోర్ రూమ్‌లోని కొంత సామగ్రి కాలిపోయింది. కొద్దిరోజుల క్రితం కూడా ఇదే హాస్పిటల్లో జరిగిన అగ్ని ప్రమాదంలో ఏసీలు కాలిపోయిన సంగతి తెలిసిందే.