
హైదరాబాద్: వనస్థలిపురం పరిధిలోని చైన్యపురిలో అగ్ని ప్రమాదం జరిగింది. మోహన్ నగర్ లోని ఓయో హోటల్ లో తెల్లవారు జామున ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. మూడు ఫైరింజన్లతో మంటలను అదుపులోకి తెచ్చారు. మంటల్లో చిక్కుకున్న 8 మందిని పోలీసులు కాపాడారు. వీరిలో ఇద్దరు అస్వస్థతకు గురవడంతో చికిత్స కోసం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలిసి రాలేదు.