ప్రభుత్వ వైద్యంపై నమ్మకం కల్గించారు

ప్రభుత్వ వైద్యంపై నమ్మకం కల్గించారు

భద్రాచలం,వెలుగు: ప్రభుత్వ వైద్యంపై ప్రజలకు నమ్మకం కల్గించారంటూ పీవో బి.రాహుల్ ​డాక్టర్లను అభినందించారు. భద్రాచలం ఏరియా ఆస్పత్రిలో తొలిసారి లేప్రోస్కోపిక్​ సర్జరీ చేసిన డాక్టర్లను సోమవారం తన చాంబర్​లో ఆయన సన్మానించారు. ఈ సందర్భంగా రాహుల్​మాట్లాడుతూ నిరుపేదల కష్టాలను గుర్తించి వారికి మెరుగైన వైద్యం అందించడంలో వైద్యుల సేవలు మరువలేనివన్నారు. ప్రణాళిక ప్రకారం ముందుకు వెళ్లాలని సూపరింటెండెంట్ రామకృష్ణకు సూచించారు.