అనిల్ రావిపూడి చేతులమీదుగా "లక్కీ లక్ష్మణ్" ఫస్ట్ లుక్

అనిల్ రావిపూడి చేతులమీదుగా "లక్కీ లక్ష్మణ్" ఫస్ట్ లుక్
  • అనిల్ రావిపూడి చేతులమీదుగా "లక్కీ లక్ష్మణ్" ఫస్ట్ లుక్
  • సోహైల్ హీరోగా లక్కీ లక్ష్మణ్ ఫస్ట్ లుక్ రిలీజ్

బిగ్ బాస్ ఫేమ్ సోహైల్, మోక్ష జంటగా నటిస్తున్న సినిమా లక్కీ లక్ష్మణ్.  డైరెక్టర్ ఎ.ఆర్ అభి తెరకెక్కిస్తున్న ఈ మూవీ ఫస్ట్ లుక్ రిలీజైంది. బుధవారం డైరెక్టర్ అనిల్ రావిపూడి చీఫ్ గెస్ట్ గా హాజరై ఫస్ట్ లుక్ ను విడుదల చేశారు. ఈ సందర్భంగా అనిల్ రావిపూడి మాట్లాడుతూ.. "లక్కీ లక్ష్మణ్" ఫస్ట్ లుక్ చాలా బాగుంది. దర్శక, నిర్మాతలకు ఇది మొదటి సినిమా అయినా చాలా చక్కగా తెరకెక్కించారు. వీరిద్దరికీ ఈ మూవీ మంచి పేరు తీసుకురావాలి. నటుడు సోహైల్ నాకు బిగ్ బాస్ నుండి తెలుసు. తను నటన బాగుంటుంది. వీరి ముగ్గురు కాంబినేషన్ లో వస్తున్న " లక్కీ లక్ష్మణ్" గొప్ప విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను అన్నారు. 

హీరో సొహైల్ మాట్లాడుతూ... మా  అనిల్ రావిపూడి అన్న ఎంతో బిజీగా ఉన్నా  ”లక్కీ లక్ష్మణ్”  ఫస్ట్ లుక్ ను లాంచ్ చేయడం చాలా సంతోషంగా ఉంది. తను లాంచ్ చేయడంతో మా సినిమా బిగ్ సక్సెస్ అవుతుందని భావిస్తున్నాము. దర్శక, నిర్మాతలకు సినిమాపై ఎంత ప్యాషన్ ఉందో సినిమా కథలను సెలెక్ట్  చేసుకోవడంలో కూడా అంతే అభిరుచిని కలిగి ఉన్నారు. ఈ సినిమాకు టెక్నికల్ పరంగా, ఔట్ ఫుట్ పరంగా ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా సీనియర్ టెక్నీషియన్స్ తో నిర్మించారు. ఈ చిత్రం అందరికీ తప్పకుండా నచ్చుతుందన్నారు.

 డైరెక్టర్ అభి మాట్లాడుతూ…నటీ, నటులు టెక్నిషియన్స్ అందరూ ఫుల్ సపోర్ట్ చేశారు. శరవేగంగా షూటింగ్ పూర్తి చేసుకొన్న ఈ మూవీ ఫస్ట్ లుక్ లాంచ్ చేసుకునే వరకు రావడమే కాకుండా.. నా ఫేవరెట్ డైరెక్టర్ అయిన అనిల్ రావిపూడి గారి చేతుల మీదుగా మా ”లక్కీ లక్ష్మణ్”  ఫస్ట్ లుక్  విడుదల కావడం చాలా సంతోషంగా ఉంది. మా జనరేషన్ దర్శకులకు ఆయనే ఇన్స్పిరేషన్. ఔట్‌ అండ్‌ ఔట్‌ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందించిన ఈ సినిమా ప్రేక్షకులందరికీ కచ్చితంగా నచ్చుతుందన్నారు.


నటీనటులు

సోహెల్, మోక్ష, దేవి ప్రసాద్, రాజా రవీంద్ర, సమీర్, కాదంబరి కిరణ్, షాని సాల్మన్, అనురాగ్, అమీన్, శ్రీదేవి కుమార్, మాస్టర్ రోషన్, మాస్టర్ అయాన్, మాస్టర్ సమీర్, మాస్టర్ కార్తికేయ, ఝాన్సీ, రచ్చ రవి , జబర్దస్త్ కార్తిక్ , జబర్దస్త్ గీతు రాయల్ కామెడీ స్టార్స్ ఫేమ్ యాదం రాజు తదితరులు

సాంకేతిక నిపుణులు

బ్యానర్స్ – దత్తాత్రేయ మీడియా, నిర్మాతలు – హరిత గోగినేని, స్టోరీ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్, డైరెక్షన్ – ఏఆర్ అభి, సంగీతం – అనూప్ రూబెన్స్, సినిమాటోగ్రాఫర్ – ఐ. ఆండ్రూ, ఎడిటర్ – ప్రవీణ్ పూడి, పాటలు – భాస్కరభట్ల, కొరియోగ్రాఫర్ – విశాల్, ఆర్ట్ డైరెక్టర్ – చరణ్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ – విజయానంద్. కీత, పీఆర్వో – నాయుడు-ఫణి, మార్కెటింగ్ పార్ట్ నర్ – టికెట్ ఫ్యాక్టరీ, పబ్లిసిటీ డిజైనర్ – ధని ఏలే, కాస్టింగ్ డైరెక్టర్ – ఓవర్ 7 ప్రొడక్షన్స్