అయోధ్య రాముడి తొలి దర్శనం వీడియో .. తన్మయంతో పులకించిపోతున్న భక్తులు

అయోధ్య రాముడి తొలి దర్శనం వీడియో ..  తన్మయంతో పులకించిపోతున్న భక్తులు

యావత్‌ దేశం సుదీర్ఘ కాలంగా ఎదరుచూస్తున్న సమయం సంపూర్ణమైంది. ఉత్తరప్రదేశ్‌లోని రామ జన్మభూమి అయోధ్యలో నూతనంగా నిర్మించిన రామాలయంలో బాల రాముడి (Ram Lalla) కొలువుదీరాడు. ప్రధాన మంత్రి మోదీ చేతుల మీదుగా ప్రాణప్రతిష్ట (Pran Pratishtha) కార్యక్రమం శాస్త్రోక్తంగా జరిగింది. రామనామ స్మరణతో అయోధ్య మారుమోగిపోయింది. అదే సమయంలో జై శ్రీరామ్‌ నినాదంతో కోట్లాది హిందువులు పులకరించి పోయారు. సకలాభరణలతో అలంకరించిన బాలరాముడు ధనస్సు ధరించి.. కమలంపై కొలువుదీరాడు. ఆ దివ్యరూపంచూసిన భక్తులు తన్మయంతో భక్తులు పులకరించిపోతున్నారు.

#WATCH | First visuals of the Ram Lalla idol at the Shri Ram Janmaboomi Temple in Ayodhya pic.twitter.com/E0VIhkWu4g

— ANI (@ANI) January 22, 2024 >

ఎటు చూసినా జై శ్రీరామ్ పేరే వినిపిస్తోంది. దేశవ్యాప్తంగా ఆ అయోధ్య రాముని నామ జపం చేస్తోంది భారతావని. ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా మహాత్తరమైన అయోధ్య రాముని ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం జరిగింది. 500 ఏళ్ల నాటి ప్రతి భారతీయుని కల నెరవేరింది. ఇప్పటికే రాజకీయ, సినీ ప్రముఖులతో అయోధ్య కళకళలాడింది. ఈ అద్భుతమైన కార్యాన్ని వీక్షిస్తూ 140 కోట్లకు పైగా ఉన్నా భారతీయులు ఆ రాముని పట్ల తమ భక్తిని చాటుకుంటున్నారు.