ఆస్కార్ అవార్డులు పొందిన భారతీయులు వీరే..!

ఆస్కార్ అవార్డులు పొందిన భారతీయులు వీరే..!

ఆస్కార్..ప్రపంచ చలన చిత్ర రంగంలో అత్యున్నత అవార్డు. ఏ దేశానికి చెందిన యాక్టర్ అయినా..డైరెక్టర్ అయినా..సినిమాలకు చెందిన ఇతర టెక్నీషియన్ అయినా..ఆస్కార్ సాధించాలని, ఆస్కార్ అవార్డు అందుకోవాలని లేదా..కనీసం ఆస్కార్ అవార్డుకు నామినేట్ అవ్వాలనే  కోరిక తప్పకుండా ఉంటుంది. ఇప్పటి వరకు 94 ఆస్కార్ వేడుకలు జరగ్గా..ఈ వేడుకల్లో ఎంతో మంది నటుడు, డైరెక్టర్లు, ఇతర టెక్నీషియన్లు అవార్డులను దక్కించుకున్నారు. అయితే భారతదేశం నుంచి ఇంత వరకు ఎంత మంది ఆస్కార్ అవార్డును సాధించారు..ఏ ఏ విభాగాల్లో  ఆస్కార్ అందుకున్నారో చూద్దాం..

ఐదుగురికి ఆస్కార్ అవార్డు..

మన దేశం నుంచి ఇప్పటి వరకు ఐదుగురికి ఆస్కార్ అవార్డు దక్కింది. మ్యూజిక్ డైరెక్టర్ ఏ. ఆర్ రెహమాన్, కాస్ట్యూమ్ డిజైనర్ భాను అతయా, డైరెక్టర్ సత్యజిత్ రే, రైటర్  గుల్జర్, సౌండ్ ఇంజనీర్ రెసూల్ పూకుట్టి అకాడమీ ఆస్కా్ అవార్డులను దక్కించుకున్నారు.

భాను అతయా ( బెస్ట్ కాస్ట్యూమ్ డిజైనర్)

భాను అతయా..తొలి ఆస్కార్ అవార్డు అందుకున్న భారతీయురాలు. 100 సినిమాలకు కాస్ట్యూమ్ డిజైనర్ గా పని చేసిన భాను అతయా...ఎంతో మంది బాలీవుడ్ దర్శకులతో సినిమాలు చేశారు. అయితే 1983లో వచ్చిన చారిత్రక డ్రామా ‘గాంధీ’ సినిమాకు గానూ భాను అతయాకు  బెస్ట్ కాస్ట్యూమ్ డిజైనర్ విభాగంలో ఆస్కార్ అవార్డు దక్కింది. 

సత్యజిత్ రే (హానరీ అవార్డు)

బెంగాలీ సినిమా రంగంలో ప్రముఖ దర్శకుడిగా పేరొందారు సత్యజిత్ రే.  పాథర్ పంచాలీ సినిమాతో  ఫిల్మ్ ఇండస్ట్రీలో డైరెక్టర్ గా ప్రయాణం మొదలు పెట్టిన ఆయన.. ఎన్నో విజయవంతమైన... అద్భుతమైన సినిమాలను రూపొందించారు. అయితే సినిమా రంగానికి చేసిన సేవకు గానూ... 1992లో హానరీ ఆస్కార్  లైఫ్ టైమ్ అచీవ్ మెంట్ అవార్డు అందుకున్నారు.

ఏఆర్. రెహమాన్ ( ఒరిజినల్ స్కోర్, ట్రాక్)

స్లమ్ డాగ్ మిలియనీర్ సినిమాకు గానూ ఏ.ఆర్ రెహమాన్ కు ఆస్కార్ అవార్డు దక్కింది. డైరెక్టర్ డానీ బోయెల్ తెరకెక్కించిన ‘స్లమ్ డాగ్ మిలియనీర్’ ఈ మూవీ మూడు కేటగిరీలలో ఆస్కార్ కు నామినేట్ అయ్యింది.  ఒరిజినల్ స్కోర్, ట్రాక్ విభాగాల్లో ‘జయహో’ పాట రెండు ఆస్కార్ లను సొంతం చేసుకుంది. 

గుల్జర్ (బెస్ట్ ఒరిజినల్ సాంగ్)

అటు స్లమ్ డాగ్ మిలియనీర్’ చిత్రంలోని ‘జయహో’ పాట ప్రపంచాన్నే ఊపేసిందని చెప్పుకోవచ్చు. అయితే ఈ పాటను ప్రముఖ రైటర్  గుల్జర్ రాశారు. బెస్ట్ ఒరిజినల్ సాంగ్ లిరిక్స్ రాసినందుకు గాను..గుల్జర్ ఆస్కార్ అవార్డును అందుకున్నారు. 

రెసూల్ పూకుట్టి (  బెస్ట్ సౌండ్ మిక్సింగ్)

ఇక స్లమ్ డాగ్ మిలియనీర్ చిత్రానికి  సౌండ్ ఇంజనీర్ గా పని చేసిన రెసూల్ పూకుట్టి.. బెస్ట్ సౌండ్ మిక్సింగ్ విభాగంలో ఆస్కార్ అందుకున్నారు.   

అయితే ఇన్నాళ్లకు మనదేశం నుంచి మూడు చిత్రాలు ఆస్కార్ కోసం పోటీపడుతున్నాయి. రాజమౌళి ఆర్ఆర్ఆర్ నుంచి నాటు నాటు సాంగ్ బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో స్థానం దక్కించుకుంది. శౌనక్ సేన్ దర్శకత్వం వహించిన ఆల్ దట్ బ్రీత్స్ చిత్రం డాక్యుమెంటరీ ఫీచర్ ఫిలిమ్ విభాగంలో నామినేట్ అయింది. కార్తికీ గోన్సాల్వెస్ తెరకెక్కించిన ది ఎలిఫెంట్ విస్పరర్స్’ సినిమా డాక్యుమెంటరీ షార్ట్ ఫిలిమ్ కేటగిరీలో నామినేషన్ అందుకుంది. అయితే ఈ మూడు చిత్రాల్లో తెలుగు నుంచి బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో నామినేట్ అయిన ‘నాటు నాటు‘ సాంగ్ ఈసారి ఆస్కార్ పొందే అవకాశం కనిపిస్తోంది