మస్కట్: కరోనా కేసులు పెరుగుతున్నందున ఇండియా సహా మొత్తం 24 దేశాల విమాన సర్వీసులపై గల్ఫ్‌దేశం ఒమన్ నిషేధం విధించింది. తదుపరి ప్రకటన వెలువడేంత వరకు బ్యాన్ కొనసాగుతుందని అధికారిక ట్విట్టర్అకౌంట్ ద్వారా వెల్లడించింది. విమాన సర్వీసులు క్యాన్సిల్ చేసిన దేశాల్లో బ్రిటన్, ట్యునీషియా, లెబనాన్, ఇరాన్, ఇరాక్, లిబియా, బ్రూనీ, సింగపూర్, ఇండోనేషియా, ఫిలిప్పీన్స్, ఇథియోపియా, సూడాన్, టాంజానియా, సౌత్ఆఫ్రికా, ఘనా, సియెర్రా లియోన్, నైజీరియా, గినియా, కొలంబియా, అర్జెంటీనా, బ్రెజిల్, భారత్, పాకిస్థాన్, బంగ్లాదేశ్ ఉన్నాయి. కాగా ఒమన్‌లో బుధవారం ఒక్కరోజే 1,675 కొత్త కేసులొచ్చాయి. దీంతో ఆ దేశంలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కేసుల సంఖ్య 2,80,235కు చేరింది. ఒమన్‌లో ఇప్పటి వరకు 3,356 మంది కరోనాతో మరణించారు.
