మనసులే కరగని లోకం : 24 గంటలూ పని చేశాను.. అయినా ఉద్యోగం తీసేశారు..

మనసులే కరగని లోకం : 24 గంటలూ పని చేశాను.. అయినా ఉద్యోగం తీసేశారు..

మీరు ఎనిమిది – 10 గంటలు పని చేయాలన్నారు.. అలాగే చేశాను.. టార్గెట్ పెట్టారు.. దాన్ని రీచ్ అయ్యాను.. సెలవులు తీసుకోకుండా పని చేశాను.. 24 గంటలూ అందుబాటులో ఉన్నాను.. ఎప్పుడు కావాలంటే అప్పుడు కంపెనీకి పని చేశాను.. నా కుటుంబం కంటే.. మీ కంపెనీకే ఎక్కువ సేవ చేశాను.. నా కుటుంబ పరిస్థితి బాగోలేదు.. నన్ను ఉద్యోగం నుంచి తీసేశారు అని వాళ్లకు ఇప్పుడు ఎలా చెప్పగలను.. నేను చేసిన తప్పేంటీ.. ఒక్క తప్పు ఉన్నా చెప్పండి.. అయినా కంపెనీ ఒక్క తప్పు కూడా చూపించలేదు.. అయినా ఉద్యోగం నుంచి తీసేసింది.. ఉద్యోగం పోగొట్టుకునున్న బైజూ ఎంప్లాయియ్ లింక్ డ్ ఇన్ లో రాసిన లేఖ ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తుంది. అతని ఆవేదనకు అందరూ అయ్యో పాపం అంటున్నారు.. ఐటీ రంగంలో లేఆఫ్స్ ఏ విధంగా ఉన్నాయో చెప్పటానికి ఇది ఓ ఉదాహరణ మాత్రమే..

రుణదాతలతో పెరిగిన ఉద్రిక్తత మధ్య, ఖర్చు-పొదుపుల మధ్య శాఖల వారీగా సిబ్బందిని తొలగించడాన్ని బైజూ ప్రారంభించింది. పునర్వ్యవస్థీకరణ ప్రక్రియలో భాగంగా అన్ని విభాగాల్లో దాదాపు 1,000 మంది ఉద్యోగులను తొలగించేందుకు సిద్ధమైంది. ఉద్యోగులు తమ విలువైన, మొత్తం సమయాన్ని కంపెనీకి వెచ్చించినా.. తక్షణమే వారందర్నీ రాజీనామా చేయవలసిందిగా కోరినట్లు తెలుస్తోంది. ఈ ప్రక్రియతో బైజులో కంపెనీలో మొత్తం తొలగించిన ఉద్యోగుల సంఖ్య 3,500కు పెరగనుంది.

గతేడాది నుంచి ఆర్థిక పరిస్థితిని మెరుగుపర్చుకునేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తోన్న బైజూకు..  విద్యా వ్యాపారం కోసం కొత్త కస్టమర్లను పొందడం కూడా కష్టంగా మారింది. 2023 మార్చి నాటికి ఎలాగైనా పుంజుకోవాలనే లక్ష్యంతో గతేడాది అక్టోబర్ నుంచి ఆరు నెలల్లో పలు ఫేజెస్ లో దాదాపు 2వేల 5వందల మంది స్టాఫ్ ను ఇంటికి పంపించింది. తాజాగా వచ్చిన సమాచారం ప్రకారం కంపెనీ హెచ్‌ఆర్ విభాగం నుంచి ఫోన్ కాల్స్ ద్వారా వ్యక్తిగత సమాచారం ఇస్తున్నట్టు తెలుస్తోంది.