
పార్టీ మారిన ఎమ్మెల్యేపై అనర్హత వేటు తప్పదన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపుల పైన ఢిల్లీలో న్యాయ పోరాటం చేస్తున్నామని చెప్పారు. రాజ్యాంగ నిపుణులతో పార్టీ సీనియర్ ప్రతినిధుల బృందంతో చర్చించామన్నారు కేటీఆర్. త్వరలోనే సుప్రీంలో పార్టీ తరపున కేసు వేయనున్నట్లు తెలిపారు.
కోర్టు తీర్పు ద్వారా నెల రోజుల్లోనే ఫిరాయింపు నేతల అనర్హత అంశంలో స్పష్టత వస్తుందన్నారు. తెలంగాణలో ఉప ఎన్నికలు తప్పవని..పార్టీ మారిన ఎమ్మెల్యేలకు ప్రజాక్షేత్రంలో బుద్ధి చెబుతామని అన్నారు కేటీఆర్. పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్న కాంగ్రెస్ కు త్వరలోనే కోర్టుల సహాయంతో సరైన గుణపాఠం చెబుతామన్నారు.
❇️పార్టీ మారిన ఎమ్మెల్యేల పైన అనర్హత వేటు తప్పదు - బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ @KTRBRS.
— BRS Party (@BRSparty) August 5, 2024
?ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపుల పైన ఢిల్లీలో బీఆర్ఎస్ న్యాయపోరాటం
?రాజ్యాంగ నిపుణులతో పార్టీ సీనియర్ ప్రతినిధుల బృందం సమావేశం
?త్వరలోనే సుప్రీం కోర్టులో పార్టీ తరఫున కేసు వేయనున్నట్లు… pic.twitter.com/kYKtdXIL09