కాంగ్రెస్తో టచ్లోకి మల్లారెడ్డి.?

కాంగ్రెస్తో టచ్లోకి మల్లారెడ్డి.?

మాజీ మంత్రి, బీఆర్ఎస్ మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి కాంగ్రెస్ తో టచ్లోకి వెళ్లారు. రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ రెడ్డితో భేటీ అయ్యారు. తన కుమారుడు భద్రారెడ్డికి మల్కాజ్ గిరి ఎంపీ టికెట్ వచ్చేలా చూడాలని రిక్వెస్ట్ చేశారని తెలుస్తోంది. భద్రారెడ్డిని బీఆర్ఎస్ అభ్యర్థిగా బరిలోకి దించాలని మొదట మల్లారెడ్డి భావించారు. తన నిర్ణయాన్ని మార్చుకొని కాంగ్రెస్ నుంచి పోటీ చే యించాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది. మల్కాజ్ గిరి నుంచి పోటీ చేసేందుకు సినీ నిర్మాత బండ్ల గణేశ్, సినీ నటుడు అల్లు అర్జున్ మామ కంచర్ల చంద్ర శేఖర్ రెడ్డి దరఖాస్తు చేసుకున్నారు.  కొండల్ రెడ్డి కూడా బరిలోకి దిగుతా రని ప్రచారం జరిగింది. అయితే దీనిపై సీఎం రేవంత్ రెడ్డి క్లారిటీ ఇచ్చారు. 

ALSO READ :- భారీ బందోబస్తు మధ్య అక్రమ నిర్మాణాల కూల్చివేత .. బాధితులు వర్సెస్ పోలీసులు

తమ కుటుంబం నుంచి ఎవరూ పోటీ చేయ బోరని చెప్పారు. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండటం, మొన్నటి వరకు అక్కడ సీఎం రేవంత్ రెడ్డి ఎంపీగా కొనసాగడం తదితర పరిణామాల నేప థ్యంలో మల్కాజ్ గిరి నుంచి పోటీ చేస్తే తప్పక విజయం సాధిస్తా మని భావిస్తున్న మల్లారెడ్డి కాంగ్రెస్ వైపు చూస్తున్నట్టు సమాచారం. తన కుమా రుడికి కాంగ్రెస్ కండువా కప్పించి ఎన్నికల బరిలోకి దింపే ఆలోచనలో ఉన్నట్టు సమాచారం.

కూల్చివేతల వేళ భేటీ

అల్లుడు మల్కాజ్ గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి ఇవాళ మధ్యాహ్నం ఆగమేఘాల మీద వేం నరేందర్ రెడ్డితో భేటీ అయ్యారు. ఎలాగైనా కూ ల్చివేతలు ఆపాలని రిక్వెస్ట్ చేశారు. ఇందుకోసం సీఎంతో మాట్లాడాలని విన్నవించినట్టు తెలుస్తోంది.

నరేందర్ రెడ్డి ద్వారా ప్రయత్నాలు 

మాజీ మంత్రి మల్లారెడ్డి, ఆయన మల్లారెడ్డి తన కుమారుడి టికెట్ కోసం రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ రెడ్డి ద్వారా ప్రయత్నాలు ముమ్మరం చేసినట్టు సమాచారం. ఇటీవలే ఆయన వియ్యంకుడు తీగల కృష్ణారెడ్డి సైతం కాంగ్రెస్ పార్టీలో చేరిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రకరకాల ఈక్వెషన్స్ ను వాడుకొని కాంగ్రెస్ టికెట్ సంపాదించేందుకు ప్రయత్నం చేస్తున్నారని తెలుస్తోంది.

సీఎం నిర్ణయం ఎలా ఉంటుందో!

 బీఆర్ఎస్ అధికారంలోకి ఉన్న సమయంలో రేవంత్ రెడ్డిపై విమర్శల దాడి చేశారు. తొడగొట్టి తనపై సవాల్ చేసిన మల్లారెడ్డి విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది ఆసక్తిక రంగా మారింది.