బీజేపీ కార్యకర్తల సన్నాహక సమావేశం : మాజీ ఎమ్మెల్యే కొండేటి శ్రీధర్

బీజేపీ కార్యకర్తల సన్నాహక సమావేశం : మాజీ ఎమ్మెల్యే కొండేటి శ్రీధర్

వర్ధన్నపేట, వెలుగు: వరంగల్ జిల్లా వర్ధన్నపేట మున్సిపాలిటీ ఎన్నికల్లో బీజేపీ జెండా ఎగరడం ఖాయమని మాజీ ఎమ్మెల్యే కొండేటి శ్రీధర్ అన్నారు. ఆదివారం వర్ధన్నపేట పట్టణ కేంద్రంలో మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి పార్టీ కార్యకర్తల సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల నుంచి పలువురు యువకులు బీజేపీలో చేరారు. వారికి మాజీ ఎమ్మెల్యే పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు. అనంతరం ఎన్నికల ప్రచారంలో ప్రస్తావించాల్సిన అంశాలపై నాయకులు రాయపురం కుమారస్వామి, గాడిపెళ్లి రాజు, పెద్దూరి రాజు కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు.

ఈ సందర్భంగా కొండేటి శ్రీధర్ మాట్లాడుతూ దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో సంక్షేమ, అభివృద్ధి పథకాలను మోదీ ప్రభుత్వమే అమలు చేస్తోందన్నారు. వచ్చే మున్సిపల్ ఎన్నికల్లో కార్యకర్తలందరూ సమష్టిగా పని చేస్తే వర్ధన్నపేట మున్సిపాలిటీపై బీజేపీ జెండా ఎగరడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. కార్యక్రమంలో బీజేపీ నాయకులు రాయపురం కుమారస్వామి, పెద్దూరి రాజు, గాడిపెళ్లి రాజు, మైస. రాము, కొండేటి సత్యం, కేబీ రంజన్ కుమార్, తేజానాయక్, కార్యకర్తలు పాల్గొన్నారు.