150 ఎకరాల్లో మామిడి తోట.. పంట నష్టంతో కుటుంబం మొత్తం ఆత్మహత్య.. వనపర్తి జిల్లాలో ఘటన

150 ఎకరాల్లో మామిడి తోట.. పంట నష్టంతో కుటుంబం మొత్తం ఆత్మహత్య.. వనపర్తి జిల్లాలో ఘటన

మామిడి తోటలో నష్టం వచ్చిందని ఒక కుటుంబంలో నలుగురు ఆత్మహత్య చేసుకున్న ఘటన తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. వనపర్తి జిల్లా  ఖిల్లా ఘనపురం మండలం సల్కాలాపూర్ గ్రామంలో 2026 మే 27 వ తేదీన జరిగింది ఈ ఘటన. మామిడి తోటలో నష్టం రావడంతో ఫైనాన్సర్ల వేధింపులకు తాళలేక,  అప్పుల బాధ కు నలుగురు సామూహిక ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. 

స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. మృతులను నర్సింహ(42),  పుష్పలత (36) ఇద్దరు దంపతులు, వారి కుమార్తె (15), కుమారుడు (17)  చనిపోయినట్లు తెలిపారు. కొడుకును సంపులో వేసిన అనంతరం నర్సింహ ఉరి వేసుకుని మృతి చెందినట్లు తెలుస్తోంది.

దేవరకద్ర మండలం డోకూరు గ్రామానికి చెందిన కుటుంబం.. 150 ఎకరాల్లో మామిడి తోటను గుత్తకు తీసుకుని అక్కడే నివాసం ఉంటున్నారు. ఆత్మహత్యకు ముందు సెల్ఫీ వీడియో తీసి చనిపోయారు.