Heart attack: గుండెపోటుతో చనిపోయిన 14 మంది సెలబ్రిటీలు వీళ్లే..

Heart attack: గుండెపోటుతో చనిపోయిన 14 మంది సెలబ్రిటీలు వీళ్లే..

ఈ మధ్య గుండెపోట్లు వణికిస్తున్నాయి. వయస్సుతో సంబంధం లేకుండా హార్ట్ ఎటాక్స్ వస్తున్నాయి. ఛాతిలో నొప్పితో చూస్తుండగానే కుప్పకూలిపోతున్నారు. క్షణాల్లో ప్రాణం విడిస్తున్నారు. ఈ మధ్యకాంలోనే చాలామంది గుండెపోటుతో చనిపోయారు. ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేని వారు కూడా హార్ట్ ఎటాక్ తో సడెన్ గా మరణిస్తున్నారు. అప్పటివరకు ఎంతో హెల్తీగా ఉన్న వారు ఉన్నట్టుండి కుప్పకూలుతున్నారు. ఏం జరిగిందో తెలుసుకునేలోపు గుండెపోటు కారణంగా ప్రాణాలు వదులుతున్నారు. 

జూన్ 28, 2025న ప్రముఖ నటి, మోడల్​, హిందీ బిగ్​ బాస్13​ ఫేమ్​ షెఫాలీ జరివాలా  కన్నుమూసిన సంగతి తెలిసిందే. 42 సంవత్సరాల వయసులో గుండెపోటుతో షెఫాలీ మరణించారు. ఆమె అకాల మరణం బాలీవుడ్ పరిశ్రమను దిగ్భ్రాంతికి గురిచేసింది.ఈ ఐదేళ్లలో దాదాపు 15 మంది సెలబ్రిటీలు గుండెపోటుతో మరణించడం బాధాకరం

 గుండెపోటుతో చనిపోయిన సెలబ్రిటీలు వీళ్లు..

  • షెఫాలీ జరివాలా : జూన్ 28, 2025న ప్రముఖ నటి, మోడల్​, హిందీ బిగ్​ బాస్13​ ఫేమ్​ షెఫాలీ జరివాలా
  •  వ్యాపార వేత్త సంజయ్ కపూర్:   జూన్ 13, 2025న ప్రముఖ వ్యాపారవేత్త,సామాజిక వ్యక్తి సంజయ్ కపూర్  53 ఏళ్ళ వయసులో గుండెపోటుతో మరణించారు.
  • విజయ రంగరాజు : 2025 జనవరి 20న టాలీవుడ్  ప్రముఖ నటుడు విజయ రంగరాజు గుండెపోటుతో కన్నుమూశారు.
  • డేనియ‌ల్ బాలాజీ: 2024 మార్చిలో ప్రముఖ తమిళ న‌టుడు డేనియ‌ల్ బాలాజీ (48) గుండెపోటుతో మరణించారు
  • కజాన్ ఖాన్: 2023 జూన్ 13న.. పలు చిత్రాల్లో విలన్ పాత్రల్లో నటించి మెప్పించిన కజాన్ ఖాన్ గుండెపోటుతో కన్నుమూశారు
  • నటుడు సిద్ధార్థ్ శుక్లా  :  హిందీ బిగ్ బాస్ 13 విజేత, ప్రముఖ టీవీ నటుడు సెప్టెంబర్ 2, 2021న  40 సంవత్సరాల వయసులో గుండెపోటు కారణంగా హఠాత్తుగా మరణించారు.
  • నటుడు, దర్శకుడు సతీష్ చంద్ర కౌశిక్  :  బహుముఖ ప్రజ్ఞాశాలి నటుడు, దర్శకుడు,  రచయిత అయిన సతీష్ కౌశిక్ మార్చి 9, 2023న 66 సంవత్సరాల వయసులో గుండెపోటుతో మరణించారు.
  • నటుడు సిద్ధాంట్ వీర్ సూర్యవంశీ :  టెలివిజన్ నటుడు 46 ఏళ్ల వయసులో మే 19, 2022న జిమ్‌లో వ్యాయామం చేస్తూ కుప్పకూలిపోయి విషాదకరంగా మరణించాడు.
  • హాస్యనటుడు రాజు శ్రీవాస్తవ్:  ప్రముఖ హాస్యనటుడు సెప్టెంబర్ 21న 2022లో గుండెపోటుకు గురై 58 సంవత్సరాల వయసులో మరణించాడు.
  • నటుడు పునీత్ రాజ్ కుమార్: కన్నడ పవర్ స్టార్  పునీత్ రాజ్ కుమార్ 46 సంవత్సరాల వయసులో అక్టోబర్ 29, 2021న గుండెపోటుతో మరణించారు.
  •  గాయకుడు కెకె (కృష్ణకుమార్ కున్నత్) :  సింగర్ మే 31, 2022న 53 సంవత్సరాల వయసులో కోల్‌కతాలో ప్రత్యక్ష ప్రదర్శన తర్వాత గుండెపోటు కారణంగా మరణించాడు.
  • దర్శకుడు/నిర్మాత రాజ్ కౌశల్ : సినిమాలు ,  ప్రకటనలలో పేరుగాంచిన రాజ్ కౌశల్, జూన్ 30, 2021న 50 సంవత్సరాల వయసులో గుండెపోటుతో మరణించారు.
  • నటుడు చిరంజీవి సర్జా : కన్నడ సినీ నటుడు కేవలం 35 ఏళ్ల వయసులో జూన్ 7, 2020న గుండెపోటు కారణంగా మరణించారు. 
  • హాస్యనటుడు వివేక్ : తమిళ  ప్రముఖ హస్య నటుడు వివేక్ ఏప్రిల్ 17, 2021న 59 ఏళ్ల వయసులో గుండెపోటుతో మరణించారు.