మళ్లీ పెరిగిన పెట్రోల్ ధర..2 నెలల్లో 33 సార్లు

మళ్లీ పెరిగిన పెట్రోల్ ధర..2 నెలల్లో 33 సార్లు

దేశవ్యాప్తంగా పెట్రోల్ రేట్లను మరోసారి పెంచాయి ఆయిల్ కంపెనీలు. ఐతే డీజిల్ రేటును మాత్రం పెంచలేదు. ఇవాళ లీటర్ పెట్రోల్ పై 35 పైసలు పెంచుతూ నిర్ణయం తీసుకున్నాయి ఆయిల్ కంపెనీలు. దీంతో దేశరాజధాని ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర 99 రూపాయల 16 పైసలకు పెరిగింది. ఇక ముంబైలో లీటర్ పెట్రోల్ ధర 105 రూపాయల 24 పైసలుగా ఉంది. ముంబై తర్వాత బెంగళూరులో పెట్రోల్ రేటు అధికంగా ఉంది. ప్రస్తుతం అక్కడ లీటర్ పెట్రోల్ ధర 102 రూపాయల 48 పైసలకు చేరింది. ఇక లీటర్ పెట్రోల్ ధర వంద దాటిన సిటీల జాబితాలో చెన్నై కూడా చేరింది. ప్రస్తుతం చెన్నైలో లీటర్ పెట్రోల్ ధర 100 రూపాయల 13 పైసలకు పెరిగింది. మే లో ఫస్ట్ టైం భోపాల్ లో లీటర్ పెట్రోల్ ధర వంద దాటింది. దాదాపు 12 రాష్ట్రాల్లో లీటర్ పెట్రోల్ ధర వంద దాటింది. గత రెండు నెలల్లో పెట్రోల్,డీజిల్ ధరలు పది శాతం పెరిగాయి. గత నెలలో 16 సార్లు పెట్రోల్,డీజిల్ రేట్లు పెరిగాయి.