అందెశ్రీ నెల రోజులుగా మందులు వాడటం లేదు.. కీలక వివరాలు వెల్లడించిన గాంధీ వైద్యులు

అందెశ్రీ  నెల రోజులుగా మందులు వాడటం లేదు..  కీలక వివరాలు వెల్లడించిన గాంధీ వైద్యులు

ప్రముఖ కవి, రచయిత అందశ్రీ మృతి తెలంగాణ ప్రజలను తీరని విషాదంలో ముంచేసింది. 2025 నవంబర్ 10 వ తేదీన ఉదయం ఆయన చనిపోయారు. ఆయన మృతిపై గాంధీ హస్పిటల్ HoD డా.సునీల్ కుమార్ కీలక విషయాలు వెల్లడించారు. ఆరోగ్యం విషయంలో నిర్లక్ష్యం చేయడంతోనే అందెశ్రీ చనిపోయారని చెప్పారు.

ఉదయం 7:20 కి అందెశ్రీని ఆయన కుటుంబ సభ్యులు గాంధీ ఆసుపత్రికి తీసుకొచ్చారని.. హార్ట్ స్ట్రోక్ తో చనిపోయారని తెలిపారు. ఆయనకు గత 5 ఏళ్లుగా హైపర్ టెన్షన్ ఉందని.. ఒక నెలరోజుల నుంచి మెడిసిన్ వాడటం లేదని చెప్పారు. మందులు సరిగ్గా వాడక పోవడంతో ఆయాసం, చెస్ట్ డిస్ కంఫర్టబుల్ తో ఉన్నారని డాక్టర్ సునీల్ కుమార్ తెలిపారు. 

ఆరోగ్య విషయంలో అందెశ్రీ నెగ్లెట్ చేశారని కుటుంబ సభ్యులు చెప్పినట్లు తెలిపారు. రాత్రి భోజనం తర్వాత అందెశ్రీ మామూలుగానే పడుకున్నారని.. ఉదయం లేచి చూసేసరికి బాత్ రూమ్ వద్ద కింద పడిపోయి ఉన్నారని తెలిపారు. రాత్రి ఏం జరిగిందో తెలియదని.. ఉదయం 6:20 ప్రాంతంలో కుటుంబ సభ్యులు అందె శ్రీ ని గమనించారని చెప్పారు. 

ఆయనను హాస్పిటల్ కు తీసుకొచ్చిన తర్వాత  డాక్టర్ సింధూర పరిశీలించి చనిపోయినట్లు ఆర్ఎంవో డిక్లేర్ చేశారని తెలిపారు. అప్పటికే చనిపోయి ఐదు గంటలు అయి ఉండొచ్చని చెప్పారు. మూడు రోజులుగా అనారోగ్యంగా ఉన్నా కూడా వైద్యున్ని సంప్రదించకుండా నిర్లక్ష్యం చేశారని తెలిపారు. నెల రోజుల నుండి అందే శ్రీ బీపీ మాత్రలు వేసుకోలేదని తెలిపారు. 

అందెశ్రీ 2025 నవంబర్ 10న ఉదయం హైదరాబాద్ లాలాగూడలోని ఆయన ఇంట్లో ఒక్కసారిగా కుప్పకలిపోయారు. కుటుంబ సభ్యులు హుటాహుటిన గాంధీ ఆస్పత్రికి తరలించగా అప్పటికే ఆయన మృతి చెందినట్లు తెలిపారు. అందెశ్రీ మృతిపట్ల పలువురు సినీ,రాజకీయ ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు.  తెలంగాణ రాష్ట్ర అధికారిక గీతం 'జయ జయహే తెలంగాణ జననీ జయ కేతనం' ను రచించారు అందెశ్రీ.

అందెశ్రీ ప్రస్థానం

 1961 జూలై 18న సిద్దిపేట జిల్లా రేబర్తిలో అందెశ్రీ జన్మించారు. ఆయన అసలు పేరు అందె ఎల్లయ్య. ఈయన గొడ్ల కాపరిగా పనిచేసారు. శృంగేరి మఠానికి సంబంధించిన స్వామీ శంకర్ మహారాజ్ ఇతను పాడుతుండగా విని ఇతడిని చేరదీసాడు. రాష్ట్రవ్యాప్తంగా ఈయన పాటలు ప్రసిద్ధం. నారాయణ మూర్తి ద్వారా వచ్చిన విప్లవాత్మక సినిమాల విజయం వెనుక ఈ పాటలున్నాయి. తెలంగాణ, ప్రకృతి లాంటి అంశాలపై ఈయన గేయరచన చేసారు.  2006లో గంగ సినిమాకు గానూ నంది పురస్కారాన్ని అందుకున్నారు