
సిటీలో గణేశ్ నిమజ్జన ఉత్సవాలు సందడిగా ప్రారంభమయ్యాయి. మూడు రోజులపాటు పూజలందుకున్న గణనాథులను భక్తులు ఊరేగింపుగా తీసుకొచ్చి నిమజ్జనం చేశారు. శుక్రవారం ట్యాంక్ బండ్‌తో సహా నగరంలోని పలు ప్రాంతాల్లో నిమజ్జన కార్యక్రమాలు జోరుగా సాగాయి. అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు పటిష్ఠ చర్యలు తీసుకున్నారు.– వెలుగు, హైదరాబాద్ సిటీ