గంగమ్మ ఒడికి బాలాపూర్ గణేష్

గంగమ్మ ఒడికి బాలాపూర్ గణేష్

బాలాపూర్ గణేష్ నిమజ్జనం పూర్తయింది. ఎన్టీఆర్ మార్గ్ లోని క్రేన్ నంబర్ 12 దగ్గర వినాయకుడిని నిమజ్జనం చేశారు అధికారులు.  భారీ క్రేన్ సాయంతో  గంగమ్మ ఒడికి చేరాడు గణనాథుడు. చివరి సారిగా భక్తులు లంబోదరుడిని దర్శించుకున్నారు. 

బాలాపూర్  హనుమాన్ టెంపుల్ నుంచి ఇవాళ ఉదయం  ఊరేగింపు మొదలై గణేశ్​చౌక్ ఎడమ వైపు నుంచి డైమండ్ హోటల్,  బాలాపూర్ గణేశుడు అక్కడి నుంచి మైసమ్మకట్ట మీదుగా చాంద్రాయణగుట్ట, చార్మినార్, అఫ్జల్‌గంజ్‌,ఎంజే మార్కెట్ .. అబిడ్స్, బషీర్‌‌బాగ్‌, లిబర్టీ వై జంక్షన్‌ మీదుగా ట్యాంక్​బండ్ వరకు శోభాయాత్ర జరిగింది.  భక్తులు భారీగా తరలివచ్చారు. 

Also Read:-బై.. బై.. గణేషా : మహా గణపతి.. మహా నిమజ్జనం

మరో వైపు  బాలాపూర్ గణేశుడి లడ్డు ఈ ఏడాది ( 2024 ) 30 లక్షల వెయ్యి రూపాయలు పలికింది.. కొలన్ శంకర్ రెడ్డి అనే వ్యక్తి బాలాపూర్ లడ్డు ప్రసాదాన్ని దక్కించుకున్నారు.గత ఏడాది కంటే.. ఈసారి 3 లక్షల రూపాయలు అదనంగా పలికింది. బాలాపూర్ లడ్డూ వేలంలో ఇదే రికార్డ్.