
వినాయకచవితి నవరాత్రిళ్లు ముగిశాయి . సెప్టెంబర్ 6.. శనివారం స్వామి నిమజ్జనానికి అన్ని ఏర్పాట్లు చేశారు. ఆగస్టు 27 నుంచి తొమ్మిది రాత్రుల పాటు పూజలు నిర్వహించి, ఆ తర్వాత మట్టి విగ్రహాలను నిమజ్జనం చేసేందుకు భక్తులు సిద్దమయ్యారు. సెప్టెంబర్ 6 వ తేది శనివారంశోభాయాత్రను నిర్వహించి స్వామిని నిమజ్జనం చేస్తారు. మరి స్వామి నిమజ్జనోత్సవం ఎలాంటి మంత్రాలను జపించాలి.. శోభాయాత్రలో స్వామిని ఎలా ప్రార్ధించాలి..ఏ శ్లోకాన్ని పఠిస్తూ గణపతి విగ్రహాన్ని నీళ్లలోకి వదలాలో ఈ స్టోరీలో తెలుసుకుందాం. . .
- వినాయక మండపంలో గణనాధుడిని కదిలించడానికి ముందు ఉద్వాసన పూజ చేయాలి.
- యధాస్థానం ప్రవేశయామి ..పూజార్థం పునరాగమనాయచ
- శోభాయాత్రలో గణేషుడి భజన పాటలు పాడుతూ.. స్వామివారి నిమజ్జనం శోభాయాత్రలో ఈ క్రింద శ్లోగన్స్
- యంతు దేవగణః సర్వే పూజామాదయ మోమ్కీం....ఇష్టకామసమృద్దర్థం పునరపి పునరాగమనా చ ||”
- ‘గచ్చ గచ్చ సురశ్రేష్ఠ స్వస్థానే పరమేశ్వర...మమ పూజా గ్రహీత్మేవం పునరాగమనాయ చ||”
- గణపతి బప్పా మోరియా, అగలే బరస్ తు జల్దీ ఆ! (గణపతి తండ్రీ, వచ్చే సంవత్సరం త్వరగా రావా!).
- జై గణేష్ మహారాజ్ కీ ...
- గణపతి బప్పా మోర్యా, మంగళమూర్తి మోరియా
- మూషికవాహన మోర్యా.. మోదకహస్త మోర్యా.
- గణపతిని నీటిలో నిమజ్జనం చేయడానికి ముందు ఈ నినాదాలను పఠించాలి.
- పూజలో జరిగిన పొరపాట్లకు క్షమాపణలు కోరుతూ, అలాగే వచ్చే సంవత్సరం త్వరగా రావాలని కోరుతూ స్వామిని ప్రార్థిస్తారు.