మనం రోజూ చూసే గ్యాస్ సిలిండర్లు రకరకాల రంగుల్లో ఉంటాయి. కేవలం పైకి చూడటానికి కోసం కాకుండా, లోపల ఉన్న గ్యాస్ ప్రమాదకరమైనదా కాదా అని గుర్తు పట్టడానికి ఈ రంగులు వాడతారు. అయితే ఏ రంగు దేనికో తెలుసా...
1. ఎరుపు రంగు- వంట గ్యాస్ (LPG)
మన వంటింట్లో వాడే సిలిండర్లు ఎరుపు రంగులో ఉంటాయి. ఇందులో LPG ఉంటుంది. ఇది చాలా తొందరగా మంట అంటుకుంటుంది కాబట్టి, ఇది ప్రమాదకరం అని సూచించడానికి ఎరుపు రంగు వేశారు.
2. తెల్ల రంగు- ఆక్సిజన్
ఆసుపత్రుల్లో, అంబులెన్స్‌లలో ఉండే సిలిండర్లు తెల్ల రంగులో ఉంటాయి. ఇందులో ఆక్సిజన్ ఉంటుంది. ముఖ్యంగా కరోనా సమయంలో వీటిని ఎక్కువగా చూసి ఉంటారు.
3. నీలం రంగు- లాఫింగ్ గ్యాస్
నీలం రంగు సిలిండర్లలో నైట్రస్ ఆక్సైడ్ ఉంటుంది. దీనినే లాఫింగ్ గ్యాస్ అని కూడా అంటారు. ఆపరేషన్లు చేసేటప్పుడు లేదా పంటి నొప్పికి చికిత్స చేసేటప్పుడు రోగులకు మత్తు ఇవ్వడానికి డాక్టర్లు దీనిని వాడుతుంటారు.
4. నలుపు రంగు - నైట్రోజన్
నలుపు రంగు సిలిండర్లలో నైట్రోజన్ గ్యాస్ ఉంటుంది. దీనిని సాధారణంగా ఆహార పదార్థాలు పాడుకాకుండా ప్యాకింగ్ చేయడానికి, అలాగే వాహనాల టైర్లలో గాలి నింపడానికి ఉపయోగిస్తారు.
►ALSO READ | అమెరికా మాపై దాడి చేస్తే.. మేము భారత్‌పై బాంబులు వేస్తాం: పాక్ మాజీ రాయబారి
5. గోధుమ లేదా మెరూన్ రంగు- హీలియం
ఈ సిలిండర్లలో హీలియం గ్యాస్ ఉంటుంది. ఇది గాలి కంటే చాలా తేలికగా ఉంటుంది. అందుకే మనం గాలిపటాలు లేదా గాలిలో ఎగిరే బెలూన్లలో దీనిని నింపుతారు.
6. పసుపు రంగు - కమర్షియల్ గ్యాస్
సాధారణంగా హోటళ్లు, రెస్టారెంట్లలో వాడే పెద్ద సిలిండర్లు పసుపు రంగులో ఉంటాయి. వీటిని వ్యాపార అవసరాల కోసం ఉపయోగిస్తారు. సిలిండర్ మీద రాసి ఉన్నది చదవకపోయినా, దూరం నుండి రంగును బట్టి అది ఏ గ్యాస్ అని గుర్తు పట్టడానికి ఈ విధానం చాలా ఉపయోగపడుతుంది. గ్యాస్ తప్పుగా వాడితే ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది కాబట్టి ఈ రంగుల గురించి తెలుసుకోవడం మంచిది.
