ఘన్ శ్యామ్ జ్యువెలర్స్ ఎండీ అరెస్ట్

ఘన్ శ్యామ్ జ్యువెలర్స్ ఎండీ అరెస్ట్

హైదరాబాద్: నగల వ్యాపారి సంజయ్ కుమార్ అగర్వాల్ ను ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ఆదివారం అరెస్టు చేసింది. పుణెలో అదుపులోకి తీసుకుని కోల్ కతా కోర్టులో ప్రవేశపెట్టింది. కోర్టు అనుమతితో సోమవారం నుంచి ఏడు రోజులు కస్టడీకి తీసుకుని ఈడీ అతన్ని విచారిస్తోంది. హైదరాబాద్, బెంగళూరు, కోల్ కతా సహా దేశ వ్యాప్తంగా వీరికి బ్రాంచ్ లు ఉన్నాయి. కస్టమ్స్ డ్యూటీ ( సుంకం) చెల్లించకుండా 250 కిలోల బంగారాన్ని అక్రమంగా చెలామణి చేశారని సంజయ్ కుమార్ పై ఆరోపణలు ఉన్నాయి. మనీ లాండరింగ్ లో భాగంగా ఈడీ కేసు రిజిస్టర్ చేసి దర్యాప్తు చేస్తోంది.