మాజీ ఎంపీటీసీని కర్రలతో కొట్టి చంపి.. డంపింగ్ యార్డులో పూడ్చి..

మాజీ ఎంపీటీసీని కర్రలతో కొట్టి చంపి.. డంపింగ్ యార్డులో పూడ్చి..

మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా ఘట్కేసర్ లో జరిగిన ఘట్కేసర్ మాజీ ఎంపీటీసీ హత్య కేసులో పోలీసులు విచారణ వేగవంతం చేశారు. హత్యకు సంబంధించి క్లూస్ కోసం మహేష్ మృతదేహాన్ని బయటకు తీశారు పోలీసులు. దీనిపై మల్కాజ్గిరి ఏసీపి చక్రపాణి మాట్లాడుతూ మహేష్  జూన్ 17 వ తేది నుండి కనిపించడం లేదని వారి బంధువులు జూన్ 20 న ఘట్కేసర్ పోలీస్ స్టేషన్ లో మిస్సింగ్ కేసు ఫిర్యాదు చేశారని తెలిపారు. 

కేసు దర్యాప్తులో భాగంగా అనుమానితులను విచారణ చేశామని తెలిపారు. విచారణలో అనుమానితులు హత్య తామే చేశామని ఒప్పుకున్నారని చెప్పారు. నిందితులు కొండాపూర్ శివారులోని డంపింగ్ యార్డ్ లో మహేష్ మృతదేహాన్ని పాతి పెట్టినట్టు తెలిపారని అన్నారు ఏసీపీ. డపింగ్ యార్డులో జేసీబీ సాహయంతో మహేష్ మృతదేహాన్ని వెలికి తీసి పోస్టు మార్టం నిరవహించామని వెల్లడించారు.

 నిందితులు ఘట్కేసర్ లోని గడ్డం మహేష్ ను తన ఆఫీసులోనే కర్రల తోనే  కొట్టి చంపేసి డంపింగ్ యార్డ్ లో  పూడ్చి పెట్టారని ఆర్థిక లావా దేవిలు కోసం ఈ హత్య జరిగిందని చెప్పారు ఏసీపీ. నలుగురు నిందితులను పోలీసులు అదుపులో ఉన్నారని మరి కొందరిని అదుపులోకి తీసుకుని విచారణ చేస్తామని తెలిపారు ఏసీపీ.