కేబీఆర్ పార్కులో కుక్క పిల్లల దత్తత మేళా

కేబీఆర్ పార్కులో కుక్క పిల్లల దత్తత మేళా

హైదరాబాద్ సిటీ, వెలుగు: ‘బీ ఎ హీరో.. అడాప్ట్.. డోంట్ షాప్’ నినాదంతో ఆదివారం కేబీఆర్ పార్కులో జీహెచ్ఎంసీ వీధి కుక్కల దత్తత మేళాను నిర్వహించింది. కమిషనర్ ఆర్వీ కర్ణన్, ఖైరతాబాద్ జోనల్ కమిషనర్ అనురాగ్ జయంతి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. మేళాలో 35 కుక్కలను ప్రదర్శించగా, 22 కుక్కలను దత్తతకు తీసుకునేందుకు ప్రజలు ముందుకొచ్చారు.

 కమిషనర్ కర్ణన్ మాట్లాడుతూ.. దత్తత అనేది కేవలం స్వీకరణ కాదని, ప్రేమ, బాధ్యతతో కూడిన బంధమన్నారు. దేశీ కుక్కలు తెలివైనవి, స్థానిక వాతావరణానికి అనుగుణంగా ఉంటాయన్నారు. వీధి కుక్కల సంఖ్య తగ్గించడంతో పాటు వాటికి సురక్షిత జీవితం కల్పించడం ఈ కార్యక్రమం లక్ష్యమన్నారు. జూబ్లీహిల్స్ డిప్యూటీ కమిషనర్ వి సమ్మయ్య, చీఫ్ వెటర్నరీ ఆఫీసర్ అబ్దుల్ వకీల్ తదితరులు పాల్గొన్నారు.