జూబ్లీహిల్స్ , వెలుగు: మహిళలకు ప్రాధాన్యం ఇస్తున్న కాంగ్రెస్‌కు జూబ్లీహిల్స్ ఎన్నికల్లో అండగా నిలవాలని మేయర్ గద్వాల విజయలక్ష్మి కోరారు. జూబ్లీహిల్స్ కాంగ్రెస్ అభ్యర్థి నవీన్‌యాదవ్‌కు మద్దతుగా గురువారం ఆమె మంత్రి పొన్నం ప్రభాకర్ సతీమణి మంజుల, మంత్రి వాకిటి శ్రీహరి సతీమణి లలిత, నవీన్ యాదవ్ సతీమణి వర్షతో కలిసి యూసఫ్ గూడలోని వెంకటగిరిలో క్యాంపెయిన్‌లో పాల్గొన్నారు. ఇంటింటికీ తిరిగి మహిళలకు బొట్టు ఓట్లు అభ్యర్థించారు.
ఎల్లారెడ్డిగూడలో కోట నీలిమ క్యాంపెయిన్..
పద్మారావునగర్: పీసీసీ ఉపాధ్యక్షురాలు కోట నీలిమ గురువారం సోమాజిగూడ డివిజన్లోని ఎల్లారెడ్డిగూడ ప్రాంతంలో వ్యాపారులు, అపార్ట్ మెంట్‌వాసులతో సమావేశమయ్యారు. రెండేళ్లలో అనేక సంక్షేమ పథకాలను కాంగ్రెస్ అమలుచేసిందన్నారు. జూబ్లీహిల్స్ బైపోల్లో నవీన్యాదవ్ను గెలిపించాలని కోరారు.
