
పంజాబ్‌లోని జలంధర్ జిల్లాలో కార్ డ్రైవింగ్ నేర్చుకుంటున్న ఓ అమ్మాయి ప్రమాదవశాత్తూ ఓ న్యూస్ పేపర్ విక్రేతని, మాజీ మంత్రి & సీనియర్ బిజెపి లిడార్ మనోహర్ కల్యా కారును, అతని ఇంటిని ఢీకొట్టింది. వివరాల ప్రకారం, ఈ ఘటనలో న్యూస్ పేపర్ విక్రేత తీవ్రంగా గాయపడ్డాడు.దింతో అతన్ని జలంధర్ సివిల్ ఆసుపత్రికి తరలించారు. అలాగే డివిజన్ నంబర్ 3 పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకోని దర్యాప్తు ప్రారంభించారు.
స్థానికుల ప్రకారం, ఉదయం 7:15 గంటల సమయంలో శాస్త్రి మార్కెట్ చౌక్ వద్ద ఈ ప్రమాదం జరిగింది. "నేను నా సైకిల్‌పై వెళ్తుండగా రివర్స్ లో వస్తున్న కారు నన్ను ఢీకొట్టింది. దింతో నేను గాయపడ్డాను, అక్కడ ఉన్నవాళ్లు నన్ను జలంధర్ సివిల్ ఆసుపత్రికి తరలించారు" అని బాధితుడు చెప్పాడు. కారును రివర్స్ చేస్తుండగా ఆ అమ్మాయికి కారుపై కంట్రోల్ తప్పింది. భయంతో ఆమె ప్రమాదవశాత్తు బ్రేక్ బదులు యాక్సిలరేటర్ నొక్కడంతో కారు మొదట సైకిల్ ను, తరువాత మాజీ మంత్రి పార్క్ చేసిన కారును, చివరికి ఆయన ఇంటి గేటును ఢీకొట్టింది.
ఓ న్యూస్ పేపర్ విక్రేత గాయపడ్డాడని, ప్రస్తుతం చికిత్స పొందుతున్నాడని పోలీసులు చెప్పారు. ఈ ప్రమాదంలో కారు నడుపుతున్న అమ్మాయి స్టూడెంట్ కూడా గాయపడింది, కానీ ఇప్పుడు ఆమె ప్రమాదం దర్యాప్తు పూర్తయిన తర్వాత చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు. నుండి బయటపడింది.