గోవా షిప్‌యార్డ్ లిమిటెడ్ (జీఎస్ఎల్) మేనేజర్, డిప్యూటీ మేనేజర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. గ్రాడ్యుయేషన్, బీఈ/ బి.టెక్ అర్హత గల అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్‌లైన్ దరఖాస్తుల స్వీకరణ ఏప్రిల్ 2న ప్రారంభమై ఏప్రిల్ 22న ముగుస్తుంది.
పోస్ట్ పేరు: మేనేజర్, డిప్యూటీ మేనేజర్.
మొత్తం ఖాళీలు: 25.
విభాగాల వారీగా ఖాళీలు: మేనేజర్– వెపన్స్ 01, మెయిన్ ప్రొపల్షన్ & షాఫ్టింగ్/ ఆక్సిలరీ 1,
డిప్యూటీ మేనేజర్– మెయిన్ ప్రొపల్షన్ & షాఫ్టింగ్/ ఆక్సిలరీ 1, ఎలక్ట్రికల్/ ఎలక్ట్రానిక్స్/ పవర్ 4, సిగ్నల్ & కమ్యూనికేషన్స్ 4, వెపన్స్ 1, పైపింగ్ 2, హెచ్వీఏసీఆర్ 2, హల్/ హల్ అవుట్‌ఫిట్ 7, సేఫ్టీ 2.
ఎలిజిబిలిటీ: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి సంబంధిత విభాగంలో బీఈ/ బి.టెక్ పూర్తిచేసి ఉండాలి. పని అనుభవం తప్పనిసరి.
గరిష్ట వయోపరిమితి: 39 ఏండ్లు. ఎస్సీ, ఎస్టీలకు ఐదు సంవత్సరాలు, ఓబీసీలకు మూడు సంవత్సరాలు, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు 10 సంవత్సరాలు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
అప్లికేషన్: ఆన్‌లైన్ ద్వారా.
అప్లికేషన్ ప్రారంభం: ఏప్రిల్ 2.
అప్లికేషన్ ఫీజు: జనరల్/ ఓబీసీ/ ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు రూ.500. ఎస్సీ, ఎస్టీ, మాజీ సైనికులకు ఎలాంటి ఫీజు లేదు.
లాస్ట్ డేట్: ఏప్రిల్ 22.
సెలెక్షన్ ప్రాసెస్: అర్హత ఆధారంగా అప్లికేషన్ షార్ట్‌లిస్టింగ్, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
మరిన్ని వివరాలకు వెబ్సైట్ goashipyard.inను సందర్శించండి.
