న్యాల్కల్, వెలుగు: పత్తి చేనులో మేసిన మేకలు మృతి చెందిన ఘటన సంగారెడ్డి జిల్లా న్యాల్ కల్ మండలం మొలకలపాడులో జరిగింది. వివరాలు ఇలా ఉన్నాయి. గ్రామానికి చెందిన మేతరి సంజీవ్ తన మేకలను సోమవారం మేతకు తోలుకుని వెళ్లాడు.
పత్తి చేనులో మేస్తుండగా ఒక్కసారిగా కొట్టుకొని అతడి కళ్లేదుటే చనిపోయాయి. సుమారు రూ.2.5లక్షల నష్టం వాటిల్లిందని సంజీవ్ వాపోయాడు. రెవెన్యూ అధికారులు వెళ్లి పంచనామా చేశారు. పత్తి చేనుకు పురుగుల మందు కొట్టారా..? ఇంకేమైనా కారణమై ఉంటుందా..? అనే వివరాలు తెలియాల్సి ఉంది.
