కాళేశ్వరం దగ్గర గోదారి ఉగ్రరూపం

కాళేశ్వరం దగ్గర గోదారి ఉగ్రరూపం

ఎడతెరిపిలేని వానలతో గోదారమ్మ పరవళ్లు తొక్కుతోంది. వానలు, వరదలతో ఉదృతంగా ప్రవహిస్తోంది. భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం వద్ద  గోదావరి, ప్రాణహిత నదులు పొంగిపొర్లుతున్నాయి. కాళేశ్వరం ముక్తీశ్వరాలయం దగ్గర పుష్కర ఘాట్ల పైనుండి  గోదావరి ప్రవహిస్తోంది. దీంతో పుష్కర ఘాట్ పైన  చిరు వ్యాపారస్తులను అధికారులు ఖాళీ చేయించారు. కాళేశ్వరం వద్ద 13.820 మీటర్ల వరకు  గోదావరి నీటి మట్టం చేరుకోవడంతో....అధికారులు రెండవ ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. గోదావరి పరివాహక ప్రాంతంలోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. 

లక్ష్మీ, సరస్వతి బ్యారేజీల్లోకి వరదనీరు..
ఎగువ ప్రాంతాల నుంచి  లక్ష్మీ బ్యారేజీ లోకి భారీగా వరద నీరు వస్తోది. దీంతో బ్యారేజీ నిండుకుండలా మారింది. 13 లక్షల 15వేల 430 క్యూసెక్కుల నీరు బ్యారేజీలోకి వస్తుండటంంతో ..అధికారులు 85 గేట్లు ఎత్తి 13 లక్షల 15వేల 430 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. అటు వరదనీటితో సరస్వతీ బ్యారేజీ జలశోభను సంతరించుకుంది. సరస్వతీ బ్యారేజ్ పూర్తి నీటి సామర్ధ్యం 10.87 టీఎంసిలు కాగా..ప్రస్తుత 3.28 టిఎంసిల వరకు నీరుంది. ప్రాజెక్టులోకి 7,78,000 క్యూసెక్కుల నీరు వస్తుండగా..అంతే నీటిని 62 గేట్ల ద్వారా దిగువకు అధికారులు విడుదల చేస్తున్నారు.