న్యూఢిల్లీ: ప్రభుత్వం పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ (పీఎఫ్‌సీ), దాని అనుబంధ సంస్థ రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్ (ఆర్‌ఈసీ) లిమిటెడ్ విలీనాన్ని పరిశీలిస్తోంది. కరెంట్ ప్రొడక్షన్, డిస్ట్రిబ్యూషన్ ప్రాజెక్టులకు నిధులు అందించడంలో ఈ రెండు సంస్థలు కీలక పాత్ర పోషిస్తున్నాయి.
బడ్జెట్‌లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈ రెండు సంస్థల పునర్‌వ్యవస్థీకరణను ప్రతిపాదించారు. ఈ ప్రకటనతో వీటి షేర్లు ఆదివారం 6శాతం వరకు ఎగిశాయి. సోమవారం కూడా ఒక శాతం చొప్పున లాభపడ్డాయి. ఆర్‌ఈసీలో ప్రభుత్వ వాటా 52.63 శాతాన్ని రూ.14,500 కోట్లకు 2019 లో పీఎఫ్‌సీ కొనుగోలు చేసింది.
