హైదరాబాద్, వెలుగు: ఆటిజంపై సమాజంలో ఉన్న అపోహలు, తప్పుడు అభిప్రాయాలను తొలగించాలని గవర్నర్ శివప్రతాప్ శుక్లా సూచించారు. ఆటిజం వ్యాధి కాదని, నాడీ వ్యవస్థ అభివృద్ధికి సంబంధించిన ప్రత్యేక పరిస్థితి అని తెలిపారు. రెడ్‌హిల్స్‌లో మాధవ్ ఆటిజం ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఆటిజం అవగాహన కార్యక్రమానికి గురువారం ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు.
ఫౌండేషన్ పదేండ్లుగా అందిస్తున్న సేవలను అభినందించారు. ఆటిజాన్ని సకాలంలో గుర్తించడం, సరైన జోక్యం, శిక్షణ, అవగాహన ఎంతో కీలకమని వెల్లడించారు. మాధవ్ ఆటిజం ఫౌండేషన్ ఆధునిక డే కేర్, డే బోర్డింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేసే దిశగా ముందుకు సాగడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్థిక శాఖ ప్రధాన కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, తెలంగాణ అగర్వాల్ సమాజ్ అధ్యక్షుడు అనిరుద్ధ్ గుప్తా తదితరులు పాల్గొన్నారు.
