మాస్కో: సైబీరియాలోని ఇర్కుట్స్క్నగరంలో ప్లేగ్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్‌కు చెందిన ల్యాబ్ వర్కర్ అంతుచిక్కని న్యూమోనియాతో మరణించగా.. న్యూమోనిక్ ప్లేగ్ అనుమానాలపై ప్రపంచవ్యాప్తంగా ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.
ఆమె ద్వారా మరొకరికి ఇన్ఫెక్షన్ సోకిందని వస్తున్న వార్తలను రష్యా పబ్లిక్ హెల్త్ వాచ్‌డాగ్ ఖండించింది. ఇర్కుట్స్క్ లో ప్లేగ్ కేసు నమోదు కాలేదని స్పష్టం చేసింది. చనిపోయిన ల్యాబ్వర్కర్కు టీకా వేశామని తెలిపింది.
ఆమె మరణానికి అసలు కారణంపై స్పష్టత లేకపోవడంతో.. ఈ కేసుకు సంబంధించి మరిన్ని వివరాలు అందించాలని రష్యాను డబ్ల్యూహెచ్వో కోరింది. రష్యన్ అధికారులు ఈ అంశంపై గోప్యత పాటిస్తూ సమాచారాన్ని బయటకు రాకుండా చేశారు. రష్యా ప్రభుత్వ టీవీ, ఇతర జాతీయ మీడియా సంస్థలు కూడా దీనికి దూరంగా ఉన్నాయి.
