మిడిల్ ఈస్ట్ దేశాలకు బిగ్ రిలీఫ్: ఇరాన్‏పై దాడుల నిలిపివేతపై ట్రంప్ కీలక ప్రకటన

మిడిల్ ఈస్ట్ దేశాలకు బిగ్ రిలీఫ్: ఇరాన్‏పై దాడుల నిలిపివేతపై ట్రంప్ కీలక ప్రకటన

వాషింగ్టన్: ఇరాన్‎పై దాడుల నిలిపివేతపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక ప్రకటన చేశారు. 2026, నవంబర్ 3వ తేదీ వరకు ఇరాన్‎పై దాడులు తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు. నవంబర్‎లో అమెరికా మధ్యంతర ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన స్పష్టం చేశారు. ఇరాన్‎తో నిర్మాణాత్మక చర్చలు జరుపుతున్నామని చెప్పారు. ఇరాన్ దగ్గర అణ్వాయుధాలు ఉండకూడదని పునరుద్ఘాటించారు. ట్రంప్ ప్రకటనతో గత ఎనిమిది నెలలుగా మిస్సైళ్లు, బాంబుల మోతతో దద్దరిల్లుతోన్న మిడిల్ ఈస్ట్ కాస్త శాంతించనుంది. 

నవంబర్ 3న మిడ్ టర్మ్ ఎలక్షన్స్

అమెరికాలో ప్రతి అధ్యక్షుడు బాధ్యతలు చేపట్టిన రెండు సంవత్సరాల తర్వాత ఎన్నికలు జరుగుతాయి. వీటినే మధ్యంతర (మిడ్ టర్మ్) ఎన్నికలు అంటారు. అమెరికా పార్లమెంట్ అయిన కాంగ్రెస్‎లోని ఉభయ సభల సభ్యులను ఎన్నుకోవడానికి ఈ ఎన్నికలు నిర్వహిస్తారు. 

దేశంలోని పలు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లు, రాష్ట్ర శాసనసభ సభ్యులను ఈ ఎలక్షన్స్ ద్వారా ఎన్నుకుంటారు. ప్రస్తుత అధ్యక్షుడు తీసుకునే నిర్ణయాలు, చట్టాలపై కాంగ్రెస్ నియంత్రణ కలిగి ఉంటుంది. ఒకవేళ ప్రస్తుత అధ్యక్షుడి సొంత పార్టీ మధ్యంతర ఎన్నికల్లో ఓడిపోతే ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్‌లో మెజారిటీ సాధించి అధ్యక్షుడి నిర్ణయాలను అడ్డుకునే అవకాశం ఉంటుంది. 

ఈ నేపథ్యంలో మధ్యంతర ఎన్నికలను అధ్యక్షుడి రెండేళ్ల పాలనపై ప్రజాభిప్రాయంగా పరిగణిస్తారు. ఈ ఏడాది నవంబర్ 3న అమెరికాలో మిడ్ టర్మ్ ఎలక్షన్స్ జరగనున్నాయి. ఇరాన్‎తో యుద్ధం, ప్రపంచ దేశాలపై ఏకపక్ష సుంకాల వంటి నిర్ణయాల నేపథ్యంలో ఈ ఎన్నికల్లో ట్రంప్ నేతృత్వంలోని రిపబ్లికన్ పార్టీకి ప్రజలు ఎలాంటి తీర్పు ఇస్తారో చూడాలీ. 

మరిన్ని వార్తలు