ముందు స్పీచ్ ఉందని.. ఇపుడు లేదంటున్రు

ముందు స్పీచ్ ఉందని.. ఇపుడు లేదంటున్రు

గవర్నర్ ప్రసంగం లేకుండా బడ్జెట్ సెషన్స్ పై  ప్రెస్ నోట్ విడుదల చేశారు గవర్నర్ తమిళిసై. టెక్నికల్ కారణాలతోనే గవర్నర్ ప్రసంగాన్ని రద్దు చేశారన్నారు. ‘ ఇది కొత్త సెషన్ కాదని..అంతకుముందు జరిగిన సెషన్ కు కొనసాగింపని ప్రభుత్వం  వివరణ ఇచ్చింది.  5 నెలల తర్వాత సభ జరుగుతున్నందున గవర్నర్ ప్రసంగంతో సభ ప్రారంభం కావడం సాధ్యం కాదని  ప్రభుత్వం చెప్పింది. మొదలు గవర్నర్ స్పీచ్ ఉంటుందని చెప్పారు.. దురదృష్టవశాత్తు అనుకోకుండా జరిగిందని ప్రభుత్వం మళ్లీ వివరణ ఇచ్చింది. గవర్నర్ స్పీచ్ లేకపోవడం వల్ల ప్రభుత్వ పనితీరుపై చర్చించే అవకాశాన్ని  కోల్పోతారు. గవర్నర్ కు కొన్ని అధికారాలిచ్చినా ప్రజల సంక్షేమం కోసమే బడ్జెట్ ప్రజెంటేషన్ కు రికమండ్ చేశా’. అని గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ తెలిపారు. 

 

ఈ నెల 7 నుంచి రాష్ట్ర అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. సోమవారం సభలో బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు ఆర్థిక మంత్రి హరీష్ రావు. దీంతో అసెంబ్లీ భద్రత, ఇతర ఏర్పాట్లపై అధికారులతో రివ్యూ చేశారు స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, శాసనమండలి ప్రోటెం చైర్మన్ సయ్యద్ అమీనుల్ హసన్ జాఫ్రి. కరోనా ప్రభావం తగ్గినా వైరస్ పూర్తిగా పోనందున సభ్యులు, అధికారులు, పోలీస్ సిబ్బంది జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు స్పీకర్.