వార్షిక బడ్జెట్కు గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ కౌన్సిల్ ఆమోదం

  వార్షిక బడ్జెట్కు గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ కౌన్సిల్  ఆమోదం

వార్షిక బడ్జెట్ కు  గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ కౌన్సిల్  ఆమోదం తెలిపింది.  రూ.650 కోట్ల అంచనాతో రూపొందించిన కార్పొరేషన్ బడ్జెట్ కు ఆమోదం తెలిపింది. 

మీటింగ్  ప్రారంభంలోనే  రచ్చ మొదలైంది. మీటింగ్ కు అధికార పార్టీ ఎమ్మెల్యేలు న్యాయని రాజేందర్ రెడ్డి, నాగరాజు, రేవురు ప్రకాశ్ రెడ్డి, బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు బసవరాజ్ సారయ్య, పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి హాజరయ్యారు.  కాంగ్రెస్, బీఆర్ఎస్ కార్పొరేటర్ల నినాదాల మధ్య మేయర్ గుండు సుధారాణి అధ్యక్షతన బడ్జెట్ ప్రవేశపెట్టారు.

మేయర్ పోడియం దగ్గరకు BRS, బీజేపీ కార్పొరేటర్లు వెళ్లారు. ఇరు వర్గాల నేతలు పోటాపోటీ నినాదాలతో హోరెత్తించారు కార్పొరేటర్లు. నినాదాల మధ్యే 2024-25 ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్ ఆమోదం తెలిపింది కౌన్సిల్ సమావేశం. రూ.650 కోట్ల అంచనాతో రూపొందించిన కార్పొరేషన్ బడ్జెట్ కు ఆమోదం తెలిపింది. 

ఇటీవల బీఆర్ఎస్ కు చెందిన గుండు సుధారాణి కాంగ్రెస్ లో చేరారు. దీంతో  మేయర్ పీఠం నుంచి సుధారాణిని దింపేందుకు బీఆర్ఎస్,  బీజేపీ సభ్యులు ప్రయత్నిస్తున్నారు.  మేయర్ పదవి నుంచి తప్పించాలంటూ ఇప్పటికే కమిషనర్ జిల్లా కలెక్టర్లను కలిశారు బీఆర్ఎస్ కార్పొరేటర్లు.