
- మహిళ పేరు మీదే ఇల్లు.. వైట్ రేషన్ కార్డ్ తప్పనిసరి
- జిల్లాల్లో కలెక్టర్లకు, జీహెచ్ఎంసీలో కమిషనర్‌కు అప్లికేషన్లు
హైదరాబాద్, వెలుగు: పేదల సొంతింటి కలను నెరవేర్చడానికి తీసుకొచ్చిన గృహలక్ష్మి స్కీమ్ మార్గదర్శకాలను ప్రభుత్వం బుధవారం రిలీజ్ చేసింది. సొంత జాగా ఉంటే ఈ స్కీమ్ కింద ఇంటి నిర్మాణానికి రూ.3లక్షల సాయం అందించనుంది. ఈమేరకు గైడ్‌లైన్స్ ఖరారు చేస్తూ ఆర్ అండ్ బీ స్పెషల్ సెక్రటరీ విజయేంద్ర బోయి జీవో నంబర్ 25ను విడుదల చేశారు. ఒక్కో నియోజకవర్గానికి 3వేల ఇండ్లు, స్టేట్ రిజర్వ్ కోటాలో 43వేల ఇండ్లు మొత్తం 4లక్షల ఇండ్లు ఈ స్కీమ్ కింద సాంక్షన్ చేయనున్నారు. జిల్లాల్లో కలెక్టర్లు, జీహెచ్ఎంసీలో కమిషనర్ ఈ స్కీమ్‌ను అమలు చేస్తారు.
ప్రతి సెగ్మెంట్లో ఎస్టీలకు 10%, ఎస్సీలకు 20%, బీసీలకు 50% రిజర్వేషన్లు అమలు చేయనున్నారు. జాగా పరిశీలన, ఫొటోలు, ఇతర అంశాలపై వారం పది రోజుల్లో జీవో ఇవ్వనున్నట్లు తెలిపారు. జాగా ఎంత ఉన్న ఇల్లుగృహ లక్ష్మి స్కీమ్‌లో భాగంగా రూరల్‌లో 120 గజా లు, అర్బన్‌లో 80 గజాలు ఉంటేనే స్కీమ్ అమలు చే యాలని హౌసింగ్ అధికారులు ప్రభుత్వానికి నిరుడు ప్రపోజల్స్ పంపారు. ఇప్పటికే డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల స్కీమ్ విషయంలో ప్రభుత్వంపై పబ్లిక్‌లో వ్యతిరేకత ఉంది. ఈ క్రమంలో గృహలక్ష్మి స్కీమ్‌కు రూల్స్ ఎక్కువ ఉండొద్దని అధికారులను సీఎం ఆదేశించారు. దీంతో తాజాగా విడుదల చేసిన జీవోలో రూరల్, అర్బన్ ప్రాంతాల్లో ఎంత జాగా ఉంటే స్కీమ్ అమలు చేస్తారన్న దానిపై స్పష్టత ఇవ్వలేదు.
గృహలక్ష్మి స్కీమ్ గైడ్ లైన్స్
l మహిళ పేరు మీదే ఇల్లు సాంక్షన్.
l వైట్ రేషన్ కార్డు, సొంత జాగా ఉంటేనే అర్హులు.
l 2 రూమ్ లు, 1 టాయిలెట్‌తో నిర్మాణం.
l ఇంటి మీద గృహలక్ష్మి లోగో.
l జీవో 59 ద్వారా లబ్ధి పొందిన వాళ్లు అనర్హులు.
l కలెక్టర్‌కు అర్హులైన వాళ్లు అప్లికేషన్లు పెట్టుకోవాలి.
l ఎమ్మెల్యేలు కూడా కలెక్టర్‌కు లిస్ట్ అందజేయొచ్చు.
l అప్లికేషన్లు ఫైనల్ చేసే బాధ్యత కలెక్టర్‌దే.
l దశల వారీగా ఇండ్లను మంజూరు చేస్తారు.
l ఇండ్లు రాని వాళ్లు వెయిటింగ్ లిస్ట్ గా పరిగణిస్తారు.
l ఫీల్డ్ ఇన్ స్పెక్షన్స్, బిల్స్ ఫైనల్, బిల్స్ అప్రూవ్, బిల్స్ విడుదల అన్ని కలెక్టర్లు, జీహెచ్ ఎంసీ కమిషనర్ స్టేట్ నోడల్ అకౌంట్ నుంచి లబ్ధిదారుల ఖాతాకు బదిలీ చేస్తారు.
l స్కీమ్ అమలుకు సీజీజీ ద్వారా ప్రత్యేకంగా మొబైల్ యాప్, పోర్టల్.
l ఆన్ లైన్ పోర్టల్ ద్వారానే స్కీమ్ అమలు.
l 3 స్టేజ్ లలో రూ.1లక్ష చొప్పున సహాయం. బేస్మెంట్ లెవల్, స్లాబ్, ఇల్లు పూర్తి.. అన్ని ఫొటోలు అప్ లోడ్ చేయాలి.
l ఈ స్కీమ్ కోసం మహిళ పేరు మీద ప్రత్యేకంగా బ్యాంక్ ఖాతా ఓపెన్ చేయాలి. ఇతర ట్రాన్ సాక్షన్స్ కోసం ఈ అకౌంట్ ఉపయోగించరాదు.
l స్టేట్ హౌసింగ్ కార్పొరేషన్ లిమిటెడ్ ఎండీ రాష్ట్ర స్థాయిలో స్కీమ్ కు నోడల్ ఆఫీసర్ గా ఉంటారు.
l స్కీమ్‌కు సంబంధించి ఇతర గైడ్ లైన్స్ అన్ని ఎండీ విడుదల చేయనున్నారు.