కొత్త GST రేట్లతో.. మల్లీప్లెక్సుల్లో పాప్ కార్న్ ధరలు తగ్గాయా.. పెరిగాయా..?

కొత్త GST రేట్లతో.. మల్లీప్లెక్సుల్లో పాప్ కార్న్ ధరలు తగ్గాయా.. పెరిగాయా..?

పాప్ కార్న్ ఇష్టపడని ఎవరు ఉండరు.. ఈ రోజుల్లో అయితే  రాకరాకల ఫ్లేవర్స్ లో కూడా వస్తున్నాయి.. పాప్ కార్న్ ఒక చిరు తిండి అయినప్పటికీ దీని ధర మాత్రం షాపింగ్ మాల్స్,  మల్టీప్లెక్స్ లో హై లెవెల్ ఉంటుంది. ఈ విషయం పై సోషల్ మీడియాలో పెద్ద చర్చే జరిగింది కూడా... ఇందుకు అసలు కారణం పాప్ కార్న్ పై విధిస్తున్న GST.. చిన్న పెద్ద అని తేడా లేకుండా అందరు ఇష్టంగా తినే ఈ పాప్ కార్న్ పై ఒక్కో టెస్టుకు ఒక్కో విధంగా GST వస్సూల్ చేస్తున్నారు. దింతో పాప్ కార్న్ కొనే కస్టమర్లలో ధరల తేడా గందరగోళాన్ని సృష్టించింది.  

ప్రభుత్వం వివిధ రకాల పాప్ కార్న్ లపై రకరకాల పన్నులు విధించడంతో పాప్ కార్న్ ట్యాక్స్ పై కొద్దిరోజుల క్రితం సోషల్ మీడియాలో నెటిజన్లు  విమర్శలతో పాటు రకరకాలుగా స్పందించారు.  ప్రభుత్వం వివిధ రకాల పాప్ కార్న్ లపై రకరకాల పన్నులు విధించడంతో పాప్ కార్న్ ట్యాక్స్ పై కొద్దిరోజుల క్రితం సోషల్ మీడియాలో పెద్ద చర్చ జరిగింది. దింతో పాప్ కార్న్ పై ఎలా పన్ను విధించాలనే దానిపై ఉన్న గందరగోళానికి జిఎస్టి కౌన్సిల్ చివరికి ముగింపు పలికింది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన జరిగిన 56వ సమావేశంలో సెప్టెంబర్ 22 నుండి అమలులోకి వచ్చే కొత్త పన్ను విధానాన్ని GST కౌన్సిల్ ఆమోదించింది.

ఇప్పటి వరకు పాప్‌కార్న్‌పై రకరకాల పన్నులు అంటే మామూలుగా సాల్ట్ పాప్‌కార్న్‌పై 5% పన్ను, ప్యాక్ చేసిన పాప్‌కార్న్‌పై 12% పన్ను, అలాగే కారామెల్ పాప్‌కార్న్‌పై 18% పన్ను ఉండేది. ఇది వ్యాపారాలు అలాగే కొనుగోలుదారుల్లో గందరగోళాన్ని సృష్టించింది.

56వ కౌన్సిల్ ఎం నిర్ణయించిందంటే :ఉప్పు లేదా కారంగా ఉండే పాప్‌కార్న్‌ను మామూలుగా అమ్మినా లేదా ప్యాకెట్లలో అమ్మినా  5% GST వర్తిస్తుంది. చక్కెర ఉండి అంటే స్వీట్ గా ఉండే  కారామెల్ పాప్‌కార్న్‌పై 18% పన్ను అలాగే కొనసాగుతుంది. అలాగే  క్రీమ్ బన్స్‌ను 5% స్లాబ్‌లలోకి తీసుకువచ్చారు.

కేంద్రం ప్రతిపాదించిన కొత్త పన్ను విధానాన్ని కూడా జీఎస్టీ కౌన్సిల్ ఆమోదించింది. దీని ప్రకారం పన్ను విధానం 5%, 18% అనే రెండు రకాలుగా ఉంటుంది. దీనితో పాటు కొన్ని వస్తువులకు 40% పన్ను స్లాబ్ కూడా ఉంటుంది. ప్రస్తుతం ఉన్న 5%, 12%, 18%  ఇంకా 28% పన్ను స్లాబ్‌లకు బదులుగా ఈ కొత్త విధానం తీసుకొచ్చింది.

కిరాణా సామాగ్రి, మందుల నుండి సిమెంట్, చిన్న కార్ల వరకు పెద్ద సంఖ్యలో నిత్యావసర వస్తువులు, ఉత్పత్తులపై కూడా GSTని  తగ్గించింది. అలాగే GST కౌన్సిల్ పొగాకు, ఫిజీ డ్రింక్స్, హై-ఎండ్ వాహనాలపై  పన్ను రేట్లను పెంచింది. 

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన జరిగిన జీఎస్టీ కౌన్సిల్ ఆరోగ్య, జీవిత బీమా ప్రీమియంలను వస్తువులు & సేవల పన్ను (జీఎస్టీ) నుండి తొలగించాలని నిర్ణయించినట్లు కేంద్ర ఆర్థిక మంత్రి బుధవారం ప్రకటించారు. కొత్త  పన్ను రేట్లు 22 సెప్టెంబర్ 2025  నుండి అమలులోకి వస్తాయి.