రామచంద్రాపురం (పటాన్చెరు), వెలుగు : ప్రతి మనిషి జీవితంలో క్రీడలు కీలక పాత్ర పోషిస్తాయని వరల్డ్ఫిజికల్ ఎడ్యుకేషన్ అలయన్స్ బోర్డు డైరెక్టర్, గ్లోబల్ కమ్యూనిటీ హెల్త్ టెక్నికల్ హెడ్ ప్రొఫెసర్ చిన్నన్పరెడ్డి అన్నారు. పటాన్చెరు పరిధిలోని గీతం డీమ్డ్ యూనివర్సిటీలో మూడు రోజులపాటు నిర్వహించే గస్టో 2025–-26 స్పోర్ట్స్మీట్ను బుధవారం ఆయన ప్రారంభించారు. పలు యూనివర్సిటీలు, కాలేజీల నుంచి వందల మంది క్రీడాకారులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా చిన్నప్పరెడ్డి మాట్లాడుతూ విద్యార్థులు తమ ఆసక్తికి అనుగుణంగా జీవితాన్ని మలుచుకోవాలని సూచించారు. క్రీడలతో , జ్ఞాపకశక్తి, ఉపాధి అవకాశాలు పెరుగుతాయని చెప్పారు. కార్యక్రమంలో గీతం వీసీ ప్రొఫెసర్ డీఎస్ రావు, రెసిడెంట్ డైరెక్టర్డీవీవీఎస్ఆర్ వర్మ, క్యాంపస్ లైఫ్ డైరెక్టర్ అంబికా ఫిలిప్, స్పోర్ట్స్డిప్యూటీ డైరెక్టర్నారాయణరావు చౌదరి తదితరులు పాల్గొన్నారు.
ద్విభాషా జాతీయ సదస్సు..
గీతంలో మూడు రోజులపాటు నిర్వహించే ద్విభాషా జాతీయ సదస్సును వేగా కన్వేయర్స్ఎండీ శ్రీనివాస్ గరిమెళ్ల ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పరభాష కంటే మాతృభాషే ముద్దని తెలిపారు. పాశ్చాత్య భాషలపై ఆధారపడకుండా ఆవిష్కరణలు పెంపొందిచుకోవాలని సూచించారు. సదస్సులో కోర్ ఇంజినీరింగ్ డీన్ వీఆర్శాస్ర్తి, మెకానికల్ఇంజినీరింగ్ హెడ్ డాక్టర్ శ్రీనివాస్, మల్లేశ్వరి కరణం పాల్గొన్నారు.
