
హైదరాబాద్, వెలుగు: రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్ మండలం తుర్క యాంజాల్‌లోని మాసబ్ చెరువు ఎఫ్‌టీ ఎల్, బఫర్ జోన్ ఏరియాల్లో ఎలాంటి నిర్మాణాలు చేయరాదని హైకోర్టు ఆదేశించింది.
ఈమేరకు అధికారులు చర్యలు తీసుకోవాలని హైకోర్టు చీఫ్ జస్టిస్ ఉజ్జల్ భూయాన్, జస్టిస్ తుకారాంజీలతో కూడిన డివిజన్ బెంచ్ మంగళవారం ఆదేశాలు జారీ చేసింది. చెరువు ఎఫ్‌టీఎల్ ప్రాంతంలో అక్రమ నిర్మాణాలు చేస్తున్నారని కిషన్ అనే వ్యక్తి పిల్ దాఖలు చేశారు.
ఈ క్రమంలో పిటిషనర్ తరఫున న్యాయవాది ఆర్ ప్రశాంత్ వాదిస్తూ అక్రమ నిర్మాణా లను అధికారులు పట్టించు కోవడం లేదని తెలిపారు. ఆఫీసర్ల కౌంటర్ నిమిత్తం విచారణను ఉన్నత న్యాయస్థానం ఆగస్టు 8కి వాయిదా వేసింది.