మేనేజ్మెంట్ కోటా సీట్ల వివరాలివ్వండి:ఉన్నత విద్యామండలి ఆదేశం

మేనేజ్మెంట్ కోటా సీట్ల వివరాలివ్వండి:ఉన్నత విద్యామండలి ఆదేశం

హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా ఇంజనీరింగ్ కాలేజీల్లో  మేనేజ్ మెంట్ కోటాలో భర్తీ చేసే సీట్ల వివరాలు సమర్పించాలని తెలంగాణ ఉన్నత విద్యామండలి ప్రైవేట్ కాలేజీలకు ఆదేశాల జారీ చేసింది. సెప్టెంబర్ 5 తేదీ లోపు ఉన్నత విద్యామండలి వెబ్ సైట్ లో మేనేజ్ మెంట్  కోటా సీట్లకు సంబంధించిన వివరాలను ప్రైవేట్ కాలేజీ నమోదు చేయాలని మంగళవారం (ఆగస్టు 27) ఆదేశాలు జారీ చేసింది. లేట్ ఫీజు 1000 రూపాయులతో సెప్టెంబర్ 10వ తేదీ  వరకు అన్ లైన్ లో వివరాలు నమోదు చేయాలని ఉన్నత విద్యామండలి ఆదేశించింది.