వానలో డ్రైవింగ్: తీసుకోవాల్సిన జాగ్రత్తలు

వానలో డ్రైవింగ్: తీసుకోవాల్సిన జాగ్రత్తలు

నాలుగు చినుకులు గట్టిగ పడితే చాలు, రోడ్లు చెరువులు అయిపోతున్నాయి. ఈ టైంలో రోడ్ల మీద డ్రైవింగ్ ఎంతవరకు సేఫ్​ అనేది చెప్పలేం. అలాగని పనులు చేసుకోకుండా ఇంట్లో కూర్చోలేం. అందుకే వాన పడేటప్పుడు, ముఖ్యంగా టూ వీలర్స్​ నడిపేవాళ్లు కాస్త ఎక్కువ జాగ్రత్తగా ఉండాలి.  బైక్​ స్టార్ట్​ చేసే ముందే టైర్లు, బ్రేకులు మంచి కండిషన్​లో ఉన్నాయో లేవో చూసుకోవాలి.  వర్షం పడుతున్నప్పుడు మసకగా ఉంటుంది. అప్పుడు బండి స్లోగా నడపాలి. రోడ్డు బాగుంటేనే వేగం పెంచాలి. వాన పడినా, పడకపోయినా రెయిన్​కోట్ వెంట ఉండటం బెటర్​.  లైట్లు, ఇండికేటర్​,  గేర్స్​ సరిగ్గా పనిచేస్తున్నాయో లేదో చెక్​ చేయాలి. లైట్, ఇండికేటర్​ దగ్గరి వైర్లు బయటకు వస్తే, అవి కరెంట్​ తీగలకు తగిలి షార్ట్ సర్క్యూట్​ అయ్యే అవకాశం ఉంది.  ప్రతిసారి బండి చెయిన్​  లూబ్ (ఆయిల్​) చేయడం మర్చిపోవద్దు. వర్షంలో ఇంటికి వచ్చిన తర్వాత చెయిన్​ శుభ్రం చేసి, లూబ్​ చేయాలి.

వాన నీళ్లు ఉన్న రోడ్డులో వెళ్లాలా? వద్దా ?అనే సందేహం వస్తుంది. వాటర్ లెవల్​ బైక్​ బాష్​గార్డ్​ కంటే తక్కువ ఎత్తులో ఉంటేనే ఆ రోడ్డులో వెళ్లాలి. సేఫ్టీ కాదు అనిపిస్తే దూరమైనా సరే వేరే రోడ్డులో వెళ్లాలి.   అలాగే, రోజూ వెళ్లి వచ్చే దారిలో ఎక్కడ గుంతలు, మ్యాన్​హోల్స్​ ఉన్నాయో తెలుస్తుంది. కాబట్టి వాటిని చూసుకుని జాగ్రత్తగా బండి నడపాలి. తడి రోడ్డు మీద బ్రేకులు తొందరగా పడవు. అందుకే, ముందు వెళ్లే వెహికల్స్​కి కొంచెం ఎక్కువ గ్యాప్​ మెయింటెయిన్​ చేయాలి. ఇంజన్​ స్టార్ట్ కాకపోయినా, నీటిలో బైక్ సగం వరకు మునిగిపోయినా టెన్షన్​ పడొద్దు. ఒకవేళ వరద ఎక్కువ ఉన్న ప్రాంతంలో బైక్​ పార్క్​ చేస్తే, తెలిసిన లేదా దగ్గర్లో ఉన్న బైక్​ సర్వీస్​ సెంటర్​కి ఫోన్​ చేయొచ్చు.