వర్క్ ఇన్ స్పెక్టర్​ను బూతులు తిట్టిన కార్పొరేటర్ భర్త

వర్క్ ఇన్ స్పెక్టర్​ను బూతులు తిట్టిన కార్పొరేటర్ భర్త
  • వైరల్​గా మారిన ఆడియో రికార్డ్

మేడిపల్లి, వెలుగు: ఓ డివిజన్ కార్పొరేటర్ భర్త వర్క్ ఇన్ స్పెక్టర్​ను  ఫోన్​లో బూతులు తిట్టిన  ఘటన బోడుప్పల్ కార్పొరేషన్ పరిధిలో జరిగింది.  వివరాల్లోకి వెళితే.. కార్పొరేషన్ పరిధిలో ఇంజనీరింగ్ విభాగంలో పనిచేసే వర్క్ ఇన్ స్పెక్టర్ కు.. మంగళవారం ఓ డివిజన్ కార్పొరేటర్ భర్త ఫోన్ చేసి మాట్లాడాడు. తన డివిజన్​లో కాకుండా 16వ డివిజన్​లో రోడ్డు పనులు ఎలా పూర్తి చేస్తావంటూ అతడిని బూతులు తిట్టాడు. ‘నీ సంగతి చెప్తా.. దమ్ముంటే వాయిస్ రికార్డ్ చేసుకో’ అంటూ  బెదిరించాడు. ఇది ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్​గా మారింది. కార్పొరేటర్ భర్త పై కేసు ఫైల్ చేయడంతో పాటు కార్పొరేటర్​ను పదవి నుంచి తొలగించే వరకు ఉద్యమిస్తామని మున్సిపల్ ఉద్యోగుల సంఘం నేత కోట వెంకటేశ్వర్లు హెచ్చరించారు.