ముద్దులు..హగ్గులు.. హైదరాబాద్ పీవీ ఎక్స్ప్రెస్ వేపై జంట రొమాన్స్

ముద్దులు..హగ్గులు.. హైదరాబాద్ పీవీ ఎక్స్ప్రెస్ వేపై జంట రొమాన్స్

హైదరాబాద్లో ఓ ప్రేమ జంట హద్దులు దాటింది. అర్థరాత్రి వేళ నడిరోడ్డుపై ముద్దులతో రెచ్చిపోయింది. రన్నింగ్ కారులో సన్ రూఫ్ నుంచి బయటకు  కనిపించేలా..నిల్చుని..రోమాన్స్ లు మునిగిపోయింది. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అయింది. 
 
హైదరాబాద్లోని పీవీ ఎక్స్ ప్రెస్ వేపై ఓ కారు వేగంగా వెళ్తోంది. కొద్ది దూరం వెళ్లాక..ఓ ప్రేమ జంట కారు సన్ రూఫ్ నుంచి పైకి వచ్చారు. చల్లని గాలి..అద్భుతమైన వాతావరణంతో ఒక్కసారిగా వారి మూడ్ మారిపోయింది. ముద్దులు..హగ్గులతో రెచ్చిపోయారు. 

గులాబీ సినిమాలోని ఓ పాటలో  హీరో జేడీ చక్రవర్తి, హీరోయిన్ మహేశ్వరీ లోకాన్ని మరిచినట్లు..ఈ వీడియోలో కూడా ఈ జంట లోకాన్ని మరిచారు. రోడ్డుపై ఉన్నాం..ప్రజలు చూస్తున్నారు అని గమనించకుండా..రొమాన్స్లో మునిగిపోయింది. 

ఈ యువతి యువకులు ముద్దుల తతంగాన్ని  వెనక కారులో వస్తున్న వ్యక్తులు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అంతేకాకుండా హైదరాబాద్ పోలీసులకు ట్యాగ్ చేశారు. ఈ జంటపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.  ఈ జంట తీరుపై నెటిజన్లు మండిపడుతున్నారు. నడిరోడ్డుపై ఇదేం రోగం అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు రెసిడెన్షియల్ ప్రాంతాల్లో సోదాలు చేపడుతున్నారని..మరి పీవీ ఎక్స్ ప్రెస్ వే, శంషాబాద్ ఎయిర్ పోర్టు వంటి పరిసరాల్లో  ఎందుకు సోదాలు చేయడం లేదని ప్రశ్నిస్తున్నారు.