హైదరాబాద్ అమీర్ పేట్ సత్యం థియేటర్ దగ్గర భారీగా నగదు పట్టుబడింది. వాహనాల తనిఖీలు చేస్తుండగా..రూ. 9.50 లక్షల నగదును పోలీసులు పట్టుకున్నారు. TS 09 GB 0943 నెంబర్ గల కారులో ఎలాంటి రశీదులు లేకుండా తరలిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. ఈ నగదును తేజ్ పాల్ సింగ్ (24) అనే వ్యక్తి తరలిస్తుండగా అతన్ని అరెస్ట్ చేశారు. బంగారు షాపులో తేజ్ పాల్ సింగ్ సహాయకుడిగా పని చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
హైదరాబాద్ లో చైతన్య పురిలోనూ ఎల్బీ నగర్ పోలీసులు భారీగా నగదు పట్టుకున్నారు. హైదరాబాద్ - విజయవాడ రోడ్డులో తనిఖీలు చేపట్టగా..రూ. 33.50 లక్షల నగదు పట్టుబడింది. దిల్ సుఖ్ నగర్ నుండి ఎల్బీనగర్ వైపు వెళ్తున్న కారు డిక్కీలో ఓ వ్యక్తి ఈ నగదును తరలిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు.
ALSO READ: హైదరాబాద్కు కొత్త బాస్.. సీవీ ఆనంద్ స్థానంలో .. విక్రమ్‌సింగ్ మాన్
హైదరాబాద్ చాదర్ ఘాట్ పోలీస్ స్టేషన్ పరిధిలోనూ పోలీసులు భారీగా నగదు స్వాధీనం చేసుకున్నారు. వాహనాల్లో తనిఖీల్లో ఓ వ్యక్తి నుంచి రూ. 2.76 నగదు సీజ్ చేశారు.
