జులై మొదటి వారంలోగా కాళేశ్వరం టెస్టులన్నీ పూర్తి : ఉత్తమ్ కుమార్ రెడ్డి

జులై మొదటి వారంలోగా  కాళేశ్వరం టెస్టులన్నీ పూర్తి : ఉత్తమ్ కుమార్ రెడ్డి
  • 2027 జూన్ నాటికి ప్రాజెక్టు పునరుద్ధరణ పూర్తి చేస్తాం: ఉత్తమ్ కుమార్ రెడ్డి
  •     కమీషన్ల కోసమే కేసీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కాళేశ్వరం ప్రాజెక్టు కట్టారని ఆరోపణ
  •     మేడిగడ్డ బ్యారేజీ బోర్ హోల్స్, సాంకేతిక టెస్టుల పరిశీలన

జయశంకర్ భూపాలపల్లి /మహదేవపూర్, వెలుగు: ఈ ఏడాది జులై మొదటి వారంలోగా టెస్టులన్నీ పూర్తి చేసి వచ్చే ఏడాది జూన్ నాటికి కాళేశ్వరం ప్రాజెక్టును వినియోగంలోకి తీసుకొస్తామని నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. బుధవారం జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలంలోని మేడిగడ్డ బ్యారేజీ వద్ద చేపడుతున్న బోర్ హోల్స్ టెస్టులను పరిశీలించారు. అనంతరం బ్యారేజీ వద్ద ఇరిగేషన్ ఆఫీసర్లతో రివ్యూ చేపట్టారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, కాళేశ్వరం ప్రాజెక్టులోని అన్నారం, సుందిళ్ల, మేడిగడ్డ బ్యారేజీల వద్ద టెస్టులు వేగంగా కొనసాగుతున్నాయని చెప్పారు. జులై మొదటి వారంలో టెస్టులు పూర్తి చేసి సీడబ్ల్యూసీ, ఎన్డీఏస్ఏ అనుమతులతో నవంబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో పునరుద్ధరణ పనులు ప్రారంభించి, 2027 జూన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోగా ఈ పనులన్నీ పూర్తి చేస్తామని తెలిపారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ప్రాణహిత చెవెళ్ల ప్రాజెక్టును అప్పటి కాంగ్రెస్​ప్రభుత్వం రూ.38 వేల కోట్ల అంచనాతో చేపట్టి రూ.6 వేల కోట్లు ఖర్చు చేసిందన్నారు. 

బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక ఈ ప్రాజెక్టు కోసం రూ.11 వేల కోట్లు ఖర్చు చేసి, 30 శాతం పనులు కూడా పూర్తయ్యాయని తెలిపారు. ప్రాణహిత ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని కేసీఆర్ కోరారని, పనులు అలాగే కొనసాగితే 2017నాటికి ప్రాజెక్టు పూర్తయ్యేదన్నారు. కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు పేరు రావొద్దన్న దురుద్దేశంతో పాటు ఎక్కువ కమీషన్లు వస్తాయన్న దురాశతో కాళేశ్వరం ప్రాజెక్టు చేపట్టారని ఆయన ఆరోపించారు. తప్పుడు నిర్ణయంతో తెలంగాణకు కేసీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ తీరని ద్రోహం చేసిండని, రూ.లక్షా 45 వేల కోట్లు ఖర్చుపెట్టి మూడు బ్యారేజీలు నిర్మించినా.. చుక్క నీరు ఎత్తిపోయలేదన్నారు. ఈ కార్యక్రమంలో భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు, జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ, జిల్లా గ్రంథాలయ చైర్మన్ కోట రాజబాబు, కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు భట్టు కర్ణాకర్ తదితరులు పాల్గొన్నారు.

రీ డిజైన్ చేస్తే బ్యారేజీ పనిచేస్తది: పరిషిత్ మెహర

రీ డిజైన్ చేసి పనులు చేపడితే మేడిగడ్డ బ్యారేజీ 50 నుంచి 60 ఏండ్లు నిలబడుతుందని కాళేశ్వర పునరుద్ధరణ స్టీరింగ్ కమిటీ చైర్మన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కల్నల్ పరిషత్ మెహర అన్నారు. బుధవారం మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో కలిసి ఆయన మేడిగడ్డ బ్యారేజీని సందర్శించారు. బ్యారేజీ కుంగిన తర్వాత నుంచి ఇప్పటివరకు చోటుచేసుకున్న పరిణామాలను మొహర మంత్రికి వివరించారు. టెస్టులు జులై వరకు కంప్లీట్ చేస్తామని, వర్షాకాలం తర్వాత రీ డిజైనింగ్ పనులు ప్రారంభిస్తామన్నారు.

నిజాంసాగర్, శ్రీరాం సాగర్ లో పూడిక తీస్తాం 

వర్ని, వెలుగు: శ్రీరాంసాగర్, నిజాంసాగర్ రిజర్వాయర్లలో పూడిక తీసి స్టోరేజీ కెపాసిటీ పెంచుతామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. ఇప్పటికే లోయర్ మానేరు, మిడ్ మానేరు డ్యామ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు, కడెం ప్రాజెక్టుల కెపాసిటీ పెంచేందుకు పూడికతీత చేపట్టినట్టు చెప్పారు. నేషనల్ ఫ్రేమ్ వర్క్ ఫర్ డీ సిల్టేషన్ కింద నిజాం సాగర్ ప్రాజెక్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను చేర్చి అభివృద్ధి చేస్తామని తెలిపారు. 

బుధవారం నిజామాబాద్ జిల్లా వర్ని మండలం సిద్ధాపూర్ రిజర్వాయర్ పనులను ప్రభుత్వ సలహాదారు పోచారం శ్రీనివాస్ రెడ్డి, జహీరాబాద్ ఎంపీ సురేశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ షెట్కార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో కలిసి ఉత్తమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పరిశీలించారు. ఆ తర్వాత రూ.106 కోట్లతో 7,975 ఎకరాలకు నీరందించే జాకోరా, చందూర్ ఎత్తిపోతల పథకాలను మంత్రి ప్రారంభించి, జాకోరాలో జరిగిన సభలో మాట్లాడారు. అంతకుముందు మంత్రికి సిద్ధాపూర్ వద్ద పోచారం శ్రీనివాసరెడ్డి, సురేశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ షెట్కార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, నిజామాబాద్ కలెక్టర్ త్రిపాఠి, కామారెడ్డి ఎస్పీ రాజేశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చంద్ర, నిజామాబాద్ అదనపు డీసీపీ శుభం నగ్రాలే, డీఎఫ్ఓ సిద్ధార్థ విక్రమ్ సింగ్ స్వాగతం పలికారు. ఇరిగేషన్ కాల్వ కట్టల మీద సోలార్ విద్యుత్ ఉత్పత్తి జరిగేలా చర్యలు తీసుకోవాలని అధికారులను మంత్రి ఉత్తమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆదేశించారు. 

ఎన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌డీఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఏ రిపోర్ట్ ఆధారంగా కాళేశ్వరం పునరుద్ధరణ పనులు చేపడ్తామని, మేడిగడ్డ, సుందిళ్ల, అన్నారం బ్యారేజీలను వినియోగంలోకి తెస్తామని చెప్పారు. భూసేకరణ, అటవీ అనుమతులు, ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీల కోసం ప్రభుత్వం రూ.5 వేల కోట్లు కేటాయించిందని ఉత్తమ్ అన్నారు. సిద్ధాపూర్ రిజర్వాయర్ పనులు పూర్తి చేసేందుకు నిధులు కేటాయిస్తామన్నారు. కాంగ్రెస్‌‌ అధికారంలోకి వచ్చాక తన నియోజకవర్గంలోని జాకోర, చందూరు లిఫ్ట్ స్కీమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లను ప్రారంభించుకోవడం సంతోషంగా ఉందని ప్రభుత్వ సలహాదారు, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. నిజాంసాగర్ ఆయకట్టు పరిధిలో లేని భూములకూ సాగు నీళ్లు అందించేందుకు సిద్ధాపూర్ రిజర్వాయర్ చేపట్టినట్టు తెలిపారు. రాష్ట్ర ఆగ్రో ఇండస్ట్రీస్ చైర్మన్ కాసుల బాలరాజు, మాజీ డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి పాల్గొన్నారు.