వర్ధన్నపేట, వెలుగు : నాలుగేండ్ల బాలికపై లైంగిక దాడికి యత్నించిన ప్రభుత్వ ఉద్యోగిపై పోక్సో కేసు నమోదైంది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలంలోని ఓ గ్రామానికి చెందిన తాటికాయల భాస్కర్ జనగాం జిల్లా జఫర్ గఢ్ మండలంలో ప్రభుత్వ ఉద్యోగిగా పనిచేస్తున్నాడు.
ఆదివారం రాత్రి గ్రామంలోని తన ఇంటి ముందు ఆడుకుంటున్న నాలుగేండ్ల బాలికకు మాయమాటలు చెప్పి అత్యాచారయత్నం చేశాడు. బాలిక సైగల ద్వారా తన తల్లిదండ్రులకు విషయం చెప్పడంతో వారు వర్ధన్నపేట పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో సదరు ప్రభుత్వ ఉద్యోగి భాస్కర్ పై పోక్సో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
