Ram Charan Surgery: రామ్ చరణ్‌కు సర్జరీ సక్సెస్.. భర్త కోసం ఆలయాల్లో పూజలు చేసిన ఉపాసన

Ram Charan Surgery: రామ్ చరణ్‌కు సర్జరీ సక్సెస్.. భర్త కోసం ఆలయాల్లో పూజలు చేసిన ఉపాసన

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్‌కు కుడి చేతి మణికట్టుకు విజయవంతంగా సర్జరీ పూర్తైంది. సోమవారం (జూలై 27, 2026న) కోయంబత్తూర్‌లోని గంగా హాస్పిటల్‌లో ప్రముఖ వైద్యుల బృందం ఆయనకు శస్త్రచికిత్స నిర్వహించింది. ప్రస్తుతం రామ్ చరణ్ ఆరోగ్యం నిలకడగా ఉందని, త్వరలోనే ఫిజియోథెరపీ, రిహాబిలిటేషన్ ప్రారంభించనున్నట్లు సమాచారం.

బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కిన 'పెద్ది' సినిమా క్లైమాక్స్‌లో నిజమైన రెజ్లర్లతో చిత్రీకరించిన కుస్తీ సన్నివేశాల సమయంలో రామ్ చరణ్ మణికట్టులోని కార్టిలేజ్ (మృదులాస్థి) తీవ్రంగా దెబ్బతింది. గాయం కారణంగా తీవ్ర నొప్పిని ఎదుర్కొన్నప్పటికీ, సినిమా షూటింగ్‌తో పాటు ప్రమోషన్లకు ఎలాంటి ఆటంకం కలగకుండా చికిత్సను వాయిదా వేసుకున్నారు. సినిమా విడుదల, ప్రమోషన్ కార్యక్రమాలు పూర్తైన అనంతరం ఆయన ఆసుపత్రిలో చేరి శస్త్రచికిత్స చేయించుకున్నారు.

ప్రముఖ వైద్యుల పర్యవేక్షణలో సర్జరీ..

కోయంబత్తూర్‌లోని ప్రముఖ గంగా హాస్పిటల్‌లో డాక్టర్ ఎస్.రాజశేఖరన్ నేతృత్వంలో ఈ ఆపరేషన్ జరిగింది. ఈ శస్త్రచికిత్సలో అమెరికాకు చెందిన ప్రముఖ హ్యాండ్ సర్జన్ డాక్టర్ అలెజాండ్రో బడియా కూడా పాల్గొన్నారు. సర్జరీ సమయంలో రామ్ చరణ్ వెంట ఆయన తల్లిదండ్రులు చిరంజీవి, సురేఖలతో పాటు భార్య ఉపాసన కొణిదెల ఉన్నారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు స్పష్టం చేశారు.

ఉపాసన ప్రత్యేక పూజలు..

సోమవారం నాడు మొదలైన చరణ్ సర్జరీ సక్సెస్ అవ్వాలని, తన భర్త త్వరగా కోలుకోవాలని ఉపాసన కోయంబత్తూర్ సమీపంలోని గణేశుడు, హనుమంతుడి ఆలయాలను సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ ఫోటోలను ఆమె సోషల్ మీడియాలో పంచుకోవడంతో మెగా అభిమానులు, నెటిజన్లు రామ్ చరణ్ త్వరగా కోలుకోవాలని (Get Well Soon) అని కామెంట్లు పెడుతున్నారు.

‘పెద్ది’ కోసం చికిత్సను వాయిదా..

బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కిన 'పెద్ది' షూటింగ్ సమయంలో క్లైమాక్స్ కుస్తీ సన్నివేశాల్లో నిజమైన రెజ్లర్లతో నటిస్తుండగా రామ్ చరణ్ మణికట్టులోని కార్టిలేజ్ దెబ్బతిన్నట్లు సమాచారం. గాయం తీవ్రంగా ఉన్నప్పటికీ, సినిమా షూటింగ్, ప్రమోషన్లకు అంతరాయం కలగకుండా నెలల తరబడి నొప్పిని భరిస్తూ తన పనిని పూర్తి చేశారు.

ALSO READ : జూనియర్ ఎన్టీఆర్ కు  గాయం.. 6 నుంచి 8 వారాలు విశ్రాంతి.!

సినిమా విడుదల తర్వాతే సర్జరీ చేయించుకోవడం చరణ్‌ వృత్తిపట్ల ఉన్న అంకితభావానికి నిదర్శనమని అభిమానులు సోషల్ మీడియాలో ప్రశంసిస్తున్నారు. డాక్టర్ల సలహా మేరకు రామ్ చరణ్ త్వరలోనే ఫిజియోథెరపీ, రిహాబిలిటేషన్ ప్రారంభించనున్నారు. పూర్తిగా కోలుకున్న అనంతరం సుకుమార్ దర్శకత్వంలో రాబోతున్న భారీ చిత్రం (RC 17) షూటింగ్‌లో ఆయన పాల్గొననున్నారు.