తొలి ఏకాదశి తరువాత వచ్చే పండుగ గురు పౌర్ణమి... హిందూ గ్రంధాల ప్రకారం గురు పౌర్ణమి రోజున శ్రీ మహా విష్ణుమూర్తిని, లక్ష్మి దేవిని, చంద్రుడిని, శివుడితో పాటు గురువుని కూడా పూజించే సంప్రదాయం ఉంది. పౌర్ణమి రోజు స్నానం, దానధర్మాలు, పూజలకు చాలా పవిత్రమైనదిగా భావిస్తారు. ఈ నేపధ్యంలో ఈ ఏడాది కూడా గురు పౌర్ణమి ఈ రోజు పౌర్ణమి ఖచ్చితమైన తేదీ, శుభ సమయం ఎప్పుడు.. ఆరోజు ఏం చేయాలి.. ఏం చేయకూడదో ఈ స్టోరీలో తెలుసుకుందాం. . .!
హిందూ సంప్రదాయంలో ‘ఆషాఢ పౌర్ణమి’(గురు పౌర్ణమి/వ్యాస పౌర్ణమి) కి ఎంతో ప్రాముఖ్యత ఉంది. . పురాణాల ప్రకారం... ఈ పవిత్ర రోజున పవిత్ర స్నానం, దైవారాధన, జపం, ధ్యానం, దానధర్మాలతో కొన్ని ప్రత్యేక పరిహారాలు చేయడం ద్వారా పుణ్యఫలాలు లభిస్తాయని, పాపాల నుంచి విముక్తి కలుగుతుందని పండితులు చెబుతున్నారు.
గురు పూర్ణిమ శుభముహూర్తం వివరాలు
- ఆషాఢమాసం గురు పౌర్ణమి తిథి ప్రారంభం: జూలై 28 సాయంత్రం 6:18 గంటలకు
- పౌర్ణమి తిథి ముగింపు: జూలై 29 రాత్రి 8:05 గంటలకు
- గురుపూర్ణిమ పండుగ తేది: ఉదయం తిథి ప్రకారం జులై 29
- బ్రహ్మ ముహూర్తం: ఉదయం 04:22 నుంచి– 05:10 వరకు
- పూజకు మంచి సమయం (విజయ ముహూర్తం) : ఉదయం 05:41 నుండి 09:05
- అభిజిత్ ముహూర్తం: మధ్యాహ్నం 11:57 నుండి 12:48 వరకు
- రాహుకాలం: మధ్యాహ్నం 12:46 నుండి 02:24 వరకు
- గోధూళి ముహూర్తం: సాయంత్రం 06:20 నుండి సాయంత్రం 06:56 వరకు
ఆషాఢ పౌర్ణమి రోజున తప్పక చేయాల్సిన పనులు
- బ్రహ్మముహూర్తంలో స్నానం చేయండి
- పవిత్ర నదిలో స్నానం చేయండి.
- అవకాశం లేకపోతే, ఇంట్లో స్నానపు నీటిలో కొద్దిగా గంగాజలం కలిపి స్నానం చేయవచ్చు.
- గురు పౌర్ణమి రోజున గురువును... విష్ణువును పూజించిన వారు కెరీర్ లో ఉన్నత స్థాయికి చేరుకుంటారు.
- గురు పౌర్ణమి రోజున గీతను పారాయణం చేయాలి... గోమాతకు సేవ చేయాలి.
- గురువుగారి పాదాలకు పూజ చేయండి.
- వ్యాస పీఠాన్ని ఏర్పాటు చేసుకొని వ్యాసుడితో పాటు... విష్ణుమూర్తి .. లక్ష్మీదేవి చిత్రపటాలకు .. పండ్లు, పువ్వులు, కుంకుమ, పసుపు మొదలైన పూజా సామగ్రితో పూజించండి.
- విష్ణువును పూజించేటప్పుడు, తులసి ఆకులు సమర్పించడం మర్చిపోవద్దు
- ఆవునెయ్యితో దీపారాధన చేయండి.
- గురు పౌర్ణమి రోజున పసుపు ధాన్యాలు, పసుపు వస్త్రాలు, పసుపు రంగు స్వీట్స్ దానం ఇవ్వండి. ఇది జాతకంలో గురు గ్రహాన్ని బలపరుస్తుంది
చేయకూడని పనులు
- పేదలు, వృద్ధులు, గురువులు, సాధువులను లేదా అవసరంలో ఉన్నవారిని అవమానించవద్దు
- అనవసరమైన వాదనలు, కోపం, గొడవలు చేయకూడదు
- మద్యం, మాంసాహారానికి దూరంగా ఉండండి
- కఠినమైన మాటలు మాట్లాడవద్దు
- పూజను నిర్లక్ష్యం చేయవద్దు
Disclaimer: పైన అందించిన సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఈ కథనాన్ని జ్యోతిష్య నిపుణుల సలహాలతో పాటు ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం వినియోగించి రూపొందించబడింది. ఈ సమాచారాన్ని V6 వెలుగు యాజమాన్యం లేదా ఉద్యోగులు ధృవీకరించరు. మీకున్న జ్యోతిష్య సమస్యలకు నిపుణులను సంప్రదించటం ఉత్తమం.
