క్రూడ్ ఆయిల్ పెరిగి.. డాలర్ బలోపేతం అయితే.. బంగారం, వెండి ధరలు పడిపోతున్నాయి.. ఎందుకిలా..?

క్రూడ్ ఆయిల్ పెరిగి.. డాలర్ బలోపేతం అయితే.. బంగారం, వెండి ధరలు పడిపోతున్నాయి.. ఎందుకిలా..?

న్యూఢిల్లీ: ముడి చమురు ధరల పెరుగుదల,  డాలర్ బలోపేతం వల్ల ఢిల్లీలో బంగారం, వెండి ధరలు భారీగా పడిపోయాయి. పది గ్రాముల బంగారం ధర రూ.4,300 తగ్గి 1.56 లక్షలకు చేరింది. కిలో వెండి ధర రూ.10 వేలు తగ్గి రూ.2.45 లక్షలకు పడిపోయింది. 

అంతర్జాతీయ మార్కెట్లో స్పాట్ గోల్డ్ 2.13 శాతం తగ్గి 4,168.99 డాలర్ల వద్ద ట్రేడయింది. వెండి కూడా 2.24 శాతం తగ్గి 63.87 డాలర్ల వద్ద ముగిసింది. యూఎస్, ఇరాన్ మధ్య భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు పెరగడంతో ముడి చమురు బ్యారెల్‌‌ ధర 90 డాలర్లు దాటింది. దీనివల్ల డాలర్ బలపడింది.  

  • ఎందుకిలా..?

డాలర్ ప్రభావం: ప్రపంచవ్యాప్తంగా బంగారం,వెండి ధరలు యూఎస్ డాలర్లపై ఆధారపడతాయి.  డాలర్ బలపడినప్పుడు, అంతర్జాతీయ కొనుగోలుదారులకు గోల్డ్, సిల్వర్ లను కొనడం మరింత ఖరీదైనదిగా మారుతుంది. దీంతో డిమాండ్ తగ్గి ధరలు తగ్గుతాయి.

ముడి చమురు ధరలు: పెరుగుతున్న క్రూడ్ ఆయిల్ ధరలు ద్రవ్యోల్బణానంపై ప్రభావం చూపిస్తాయి. ఇన్ ఫ్లేషన్ అధికంగా ఉన్నప్పుడు, కేంద్ర బ్యాంకులు (యూఎస్ ఫెడరల్ రిజర్వ్ వంటివి) కఠినమైన, అధిక వడ్డీ రేట్లను కొనసాగించడానికి ఒత్తిడికి గురవుతాయి. దీంతో బంగారం, వెండి ధరలు తగ్గే అవకాశం ఉంటుంది.